కామారెడ్డి జిల్లా బీబీ పేట మండలం కోనాపూర్ లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. అనంతరం కోనాపూర్లో నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించే స్కూల్ బిల్డింగ్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పలు ఆసక్తికర విషయాలను కేటీఆర్ సభా వేదికగా వెల్లడించారు. మానేరు ప్రాజెక్టుకు మాకు అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఈ అనుబంధం గురించి తెలియజేసేందుకు కేటీఆర్ తమ పూర్వీకుల కథ చెప్పుకొచ్చారు. నానమ్మ ఊరు అప్పర్…
టీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ వరసగా ట్వీట్లు చేస్తున్నారు. గ్యాస్ ధరలు, నిరుద్యోగం, ద్రవ్యోల్భనం ఇలా ప్రతీ అంశంపై ట్విట్టర్ వేదికపై కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర అవలంభిస్తున్న తీరుతో పాటు తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర ప్రాజెక్టుల్లో తెలంగాణకు మొండిచేయి చూపడంపై కేటీఆర్ మోదీ సర్కార్ ను విమర్శిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా కేంద్రంపై ట్విట్టర్…
రూ.102 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ప్రారంభం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 56 రకాల ఆరోగ్య పరీక్షలు రేడియాలజీ, పతలాజి ల్యాబ్ లకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీశ్ రావ్. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు రోగ నిర్దారణ కోసం ఈ ల్యాబ్ లు ఉపయోగ పడుతాయని అన్నారు. 200 పడకల ఆస్పత్రి ఆవరణలోనే మెడికల్ కాలేజీ వస్తుందని హరీశ్ రావ్ అన్నారు. వారం రోజుల్లో డయాలసిస్…
తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విటర్లో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటారు. నెటిజన్ల విజ్ఞప్తులకు వెంటనే స్పందించడమే కాదు.. అప్పుడప్పుడు తానే ‘ఆస్క్ కేటీఆర్’ పేరిట ప్రజలతో ముచ్చటిస్తారు. వారి సమస్యల్ని తెలుసుకొని, అప్పటికప్పుడే పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈరోజు కూడా ఆయన ట్విటర్లో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత మధుర శ్రీధర్ ఓ ప్రశ్న సంధించారు. తెలుగు వినోద రంగానికి ప్రపంచస్థాయి ఫిలిం స్కూల్/యూనివర్సిటీ అవసరం ఉందని, తద్వారా హైదరాబాద్ను భారతీయ చిత్ర రంగానికి…
ఆంధ్ర పాలనలో లేని దుర్మార్గం టీఆర్ఎస్ పాలనలో నడుస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. హనుమకొండ డీసీసీ భవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. రాహుల్ రాకతో కేసిఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ పర్యటనపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రిపోర్ట్ తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైందన్నారు. కేసిఆర్, కేటీఆర్ లు ఎలక్షన్ టూరిస్ట్ లు…
కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. గాంధీ కుటుంబం తో పోల్చుకునే ప్రయత్నం చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అన్నారు రేవంత్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…
తెలంగాణలో బీజేపీ-టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే వుంది. బీజేపీ నేతల్ని టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శిస్తే… బీజేపీ నేతలు తామేం తక్కువ తినలేదన్నట్టుగా మాటల దాడి చేస్తున్నారు. ఉదండాపూర్ రిజర్వాయర్ ముంపు వాసుల నుంచి భూములు లాక్కుని, పునరావాసం, పరిహారం ఇవ్వలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఎక్కడుందని అడుగుతున్న టీఆర్ఎస్ నేతలకు ఇక్కడికొచ్చిన జనమే సమాధానమని తెలిపారు. ఉదండాపూర్ ప్రాజెక్టు పనులేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్…
పాలమూరులో బీజేపీకి వస్తున్న విశేష స్పందన, సభలకు వస్తున్న ప్రజలను చూశాక టీఆర్ఎస్ నేతలకు భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నేతలకు నోటికి దురద పెట్టినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సన్నాసుల్లారా… 8 ఏళ్ల పాలనలో పాలమూరు ప్రజలకు చేసిందేమిటి? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. ఆంధ్రా పాలకులకు అమ్ముడుపోయిన సన్యాసులు టీఆర్ఎస్ నేతలని మండి పడ్డారు. ఆంధ్రుకు అమ్ముడుపోయి తెలంగాణకు తాకట్టు పెట్టారని అన్నారు. ఈ…