ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో KCR జాతీయ రాజకీయాల్లోకి రానున్నాడన్న విషయం పై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఖమ్మంలో కూడా KTR కూడా ఇదే విషయం పై ప్రస్తావించడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొన్ని నెలల నుండే ఈ ప్రస్తావన ఉన్నప్పటికీ KTR వ్యాఖ్యలతో ఈ అంశం మరింత జోరందుకుంది. ఇక ఇందులో భాగంగానే .. భారతదేశం కూడా తెలంగాణ మోడల్ గా అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలి అని అందోల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే రైతు బందు, ఉచిత కరెంట్ ,కల్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ పథకాలను కేంద్రం లో అమలు చేసి మన దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అని ఆయన తెలిపారు. KCR భారతీయ రాష్ట్ర సమితి ద్వారా KCR దేశరజకీయాల్లోకి అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్రంలా భారత దేశాన్ని అభివృద్ధి పర్చాలని తీర్మానించిన అందోల్ ఎమ్మెల్యే వాదనను సమర్ధిస్తు చప్పట్లతో ఆమోదించారు వట్ పల్లి మండలంలోని నిర్జెప్ల గ్రామస్థులు.