“మీకు ఏం కావాలో అన్ని మేము ఇస్తున్నాం. మీరు చేయాల్సింది ఉద్యోగం సంపాదించడం మాత్రమే” అన్నారు. ఉచితంగా ఆన్లైన్ క్లాసుల యాప్ సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి వేములు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ లోని రాజీవ్ గాందీ ఆడిటోరియంలో.. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్ధులకు సొంత ఖర్చులతో రూపొందించిన ఆన్ లైన్ వీడియో యాప్ ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి సీపీ నాగారాజు కలిసి ప్రారంభించారు. తెలంగాణ వస్తే రాష్ట్రం…
75సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రమూ సాధించని విజయాలను ఎనిమిదేండ్లలోనే తెలంగాణ సాధించిందని కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్లలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద అమర వీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా.. రాజన్న సిరిసిల్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మహోద్యమంలో.. పాలుపంచుకున్న వారందరికి ప్రత్యేక వందనాలు…
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగంగా ఉన్నపుడు సమైక్య పాలకులు వివక్ష చూపితే, స్వరాష్ట్రంలో కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. ప్రగతిశీల రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాల్సింది పోయి, నిరుత్సాహం కలిగించేలా కేంద్రం వ్యవహరించడం విచారకరం. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్ళ నుంచే ఈ వివక్ష ప్రారంభమైంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలైనా జరుపుకోక ముందే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కు కట్టబెట్టింది. దీనివల్ల లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును మనం కోల్పోయాం. దీంతో కేంద్రం…
పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్కులో అమరవీరులకు నివాళులర్పించారు.
ప్రగతి భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు సీఎం కేసీఆర్. జాతీయ గీతం ఆలాపన. మిఠాయిలు పంచారు నేతలు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తిచేసుకొని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న శుభసందర్భంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలతో సాధించుకొన్న తెలంగాణను అదే స్ఫూర్తితో నిర్మించుకొన్నామని, నేడు దేశానికే దిక్సూచిగా ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ కొనసాగిస్తున్నదని చెప్పారు. ఇంత గొప్ప ప్రగతి సాధించిన…
కొందరు టీఆర్ఎస్ నేతలు, మంత్రులు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఐటీ మంత్రి చైనాను పొగుతున్నారని.. అక్కడ ఉన్నది మిలిటరీ రూల్ అని తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి గురించి ఇక్కడ మాట్లాడినట్లు అక్కడ మాట్లాడితే ఊరుకోరని అన్నారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలు కూడా చైనా చెప్పదని.. చైనా ప్రభుత్వం చెప్పిందే రాసుకోవాలని తెలిపారు. కేటీఆర్ గొప్పగా చెబుతున్న చైనాలో ముస్లింలను చంపుతున్నారని.. అక్కడి ప్రభుత్వానికి…