సీఎం కొడుకుతో చెప్పించుకునే పరిస్థితుల్లో బీజేపీ లేదని నిజామాబాద్ ఎంపీ బిజెపి ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అవసరమైనప్పుడు కేటీఆర్ సలహాలు తీసుకుంటామని మండిపడ్డారు. సస్పెండ్ ఎవర్ని చేయాలో.. ఎవరకి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసని నిప్పులు చెరిగారు. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వం పెద్దలు ఏమి సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని ముఖ్యమంత్రి కొడుకు బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నాడని విమర్శించారు.
గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ భాషను ఎత్తివేయాలన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏమి చేశారో సీఎం, కేటీఆర్, సోమేష్ కుమార్ సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటని మండిపడ్డారు. నాలుగు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటకీ.. టెక్ట్స్ బుక్స్ కోసం టెండర్లకు పిలవకపోవటం దారుణమని ధర్మపురి అర్వింద్ నిప్పులు చెరిగారు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం తెలంగాణలో అటకెక్కాయని ఎద్దేవ చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు.
రానున్న కాలంలో తెలంగాణ నుంచి వడ్ల కొనుగోలు అపుతామని తెలిపిందని, 593మిల్లుల్లో అధికారులు లెక్కపెట్టే వీలు లేకుండా ధాన్యాన్ని పేర్చారని విమర్శించారు ధర్మపురి అర్వింద్. 4 లక్షల 83వేల 600 బ్యాగులు తక్కువగా ఉన్నాయని, రెండు సంవత్సరాల నుంచి లెక్కపెట్టకుండా అదే పరిస్థితి కల్పించారనిన మండిపడ్డారు. కేసీఆర్ చర్యలు తీసుకుంటామని ఇప్పటి వరకు తీసుకోలేదని లేఖలో పేర్కొందని ధర్మపురి అర్వింద్ తెలిపారు. కవితకు హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషమంటూ ఎద్దేవ చేశారు. బైంసాలో హిందువుల మీద దాడులను ఆపాలని కవితకు విజ్ఞప్తి చేస్తున్నామని ధర్మపురి అర్వింద్ అన్నారు.
Wife Harassing Husband: దేశం కోసం పోరాడాడు.. భార్య వేధింపులకు బలయ్యాడు