బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్‌కు నిరసనగా రాజకీయ పార్టీలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నివీర్ ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అగ్నిపథ్‌తో యువత డ్రైవర్లు, ఎలక్ట్రిషన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్రమంత్రి అన్నారని ఆయన పేర్కొన్నారు. అగ్నివీర్లను సెక్యూరిటీ…
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసంపై కేటీఆర్ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. దీనిని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. నాడు రైతులతో పెట్టుకున్నారని.. నేడు జవాన్లతో పెట్టుకున్నారని పేర్కొన్నారు. ‘అగ్నివీర్ స్కీమ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసాత్మక నిరసనలు దేశంలోని నిరుద్యోగ సంక్షోభానికి నిలువెత్తు నిదర్శనం. తొలుత దేశంలో రైతులతో పెట్టుకున్నారు. ఇప్పుడు దేశంలోని జవాన్ అభ్యర్థులతో పెట్టుకుంటున్నారు. వన్ ర్యాంక్ – వన్ పెన్షన్ నుంచి ప్రతిపాదిత నో ర్యాంక్ – నో…
గత మూడురోజులుగా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ (నాలుగోరోజు)కూడా ఆందోళనకు సిద్దమవుతున్న నేపథ్యంలో బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. విద్యార్థుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను కలిసి వారి సమస్యలను, డిమాండ్లను బండి సంజయ్ తెలుసుకోనున్నారు. కాగా.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. నిన్న బాసర ట్రిపుల్…
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం టీఆర్ఎస్లో రాజకీయాలు వినూత్నంగా మారుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మరోసారి పోటీ చేస్తారా లేక.. ఆయనకు బదులుగా కొత్తగా పార్టీలో చేరిన చల్మెడ లక్ష్మీ నరసింహరావుకు టికెట్ ఇస్తారా అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇద్దరు నాయకులు వేములవాడలో పోటాపోటీగా సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదే స్పీడ్‌తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అది కేడర్‌ను మరింత గందరగోళంలోకి నెడుతోందట. కొంతకాలంగా ఎమ్మెల్యే రమేష్ పౌరసత్వంపై వివాదం చెలరేగుతోంది. సమస్య కోర్టు…
టీఆర్ఎస్ పార్టీ నేతలు బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగడుతున్నారు. ఇటీవల 10 లక్షల ఉద్యోగాలపై టీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఇది ఎన్నికల స్టంట్ గా అభివర్ణించింది. దీనిపై ప్రధాని మోదీని విమర్శిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే 10 లక్షల ఉద్యోగాలను స్వాగతిస్తున్నాం అంటూనే గతంలో బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించిందని.. ప్రస్తుతం ఉద్యోగాల భర్తీని నమ్మలేమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు దేశంలో ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్భనం,…
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్.…
https://youtu.be/DYnVB9hURP8 పుడమిని రక్షించుకుందాం అని సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు ఇవ్వడంతో ప్రముఖులు కదలివచ్చారు. ఏటా సుమారు 27 వేల జీవ జాతులు అంతరించిపోతున్నాయి. సారవంతమైన భూమిలో కనీసం 3 నుంచి 6 శాతం సేంద్రియ పదార్థం ఉండాలి. కానీ.. భారత్ లోని భూముల్లో సుమారు 0.65 శాతం మాత్రమే సేంద్రియ పదార్థం ఉంది. ఫ్రెంచ్ లో మట్టిని కాపాడుకునేందుకు పాలసీలు చేసినా ఆచరణలో మాత్రం ముందుకు కదలలేదు. మట్టిని కాపాడటం గురించి మన పిల్లలకు చెప్పడంకంటే…
ప్రతిభకు ఆకాశమే హద్దు.. కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం అని సూచించారు మంత్రి కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రతిభకు ఆకాశమే హద్దు.. వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ వాడకాన్ని తగ్గించండి.. 3 నెలలు ప్రణాళిక బద్ధంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పటిష్టత కోసం ఆ పార్టీ నాయకత్వం కృషిని ప్రారంభించింది. పార్టీలో అసంతృప్తి వాదులుగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి లు పార్టీ కార్యాలయానికి వచ్చేలా చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇది పార్టీ లో ఒక్కవిజయంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లోనే ఉన్నప్పటికి పార్టీలో ఎటువంటి పదవులు లేకుండా ఉన్న వారిని కూడా దగ్గరకు తీసుకునే చర్యలు పార్టీ చేపట్టినట్లుగా అయ్యింది. పోలీసుల వినియోగాన్ని…