KTR: హైదరాబాద్‌లో ఇటీవల శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాపులో గన్‌పాయింట్ దోపిడీ జరగడం, కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజలలో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని.. శాంతిభద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ…
పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కూలలేదా?.. కాంగ్రెస్, బీజేపీకి పోలవరాన్ని కూలవరం అనే దమ్ముందా? అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరం విషయంలో ఒక విధానం, పోలవరం విషయంలో మరో విధానమా? అని ప్రశ్నించారు.. పోలవరం కాఫర్ డ్యామ్‌పై ఎన్డీఎస్ఏ మౌనం ఎందుకు? అని నిలదీశారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
KTR Sends Legal Notice to Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ లీగల్ నోటీసు పంపారు. ఫోన్ టాపింగ్ కేసులో బండి సంజయ్ అడ్డగోలుగా, అసత్యపూరితంగా చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ లీగల్ నోటీస్ పంపారు. కేంద్రమంత్రిగా ఉండి బాధ్యతారహితంగా మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధి మరొక ప్రజా ప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం దుర్మార్గం అంటూ నోటీసులలో పేర్కొన్నారు. Also…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పులపై కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను ఖండించారు. రేవంత్ రెడ్డి పొడుగుచేసిన అప్పులపై వివాదాలను ఆయన కఠినంగా విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం, బీఆర్ఎస్ హయాంలో తెలంగాణకు ఉన్న అప్పు మొత్తం 8 లక్షల కోట్లుగా కాదు, కేవలం రూ. 3.5 లక్షల కోట్లే ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ నిజాలు బయటపడటంతో కాంగ్రెస్ పార్టీ ఆర్థిక నాటకాలు ఆపవలసి వచ్చింది. Donald…
KTR Slams Congress Over Rythu Bima Renewal Rules: ‘రైతు బీమా’ పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024-25 బీమా గడువు ఆగష్టు 13తో ముగుస్తుండగా.. 2025-26కి ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. రైతు బీమా పథకంలో చేరే రైతులు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. రైతులు తమతో పాటు నామినీకి చెందిన ఆధార్ కార్డు, పట్టా పుస్తకం దరఖాస్తుకు జతచేసి స్వయంగా…
Bandi Sanjay : ఫోన్ ట్యాపింగ్ వివాదం నేపధ్యంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ బండి సంజయ్, “ట్విట్టర్ టిల్లు.. నువ్వు చేసిన అక్రమాలను మర్చిపోయి లీగల్ నోటీసుల గురించి మాట్లాడడం సిగ్గుచేటు” అంటూ వ్యాఖ్యానించారు. లీగల్ నోటీసుల వెనక దాక్కుంటూ…
KTR : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరుగుతోంది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఆయన బండి సంజయ్‌కు లీగల్ నోటీసు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేటీఆర్ వ్యాఖ్యల్లో బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఫోన్ ట్యాపింగ్ విషయంలో…
మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతూ.. కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు.. కాలే యాదయ్య ఏ పార్టీలో ఉన్నారో పక్కనే ఉన్న స్పీకర్ కు తెలియడం లేదని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ లో ఉన్నారని చెప్పుకుంటున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పిటీసీ కాకముందే సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డిపై ఓడిపోయిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టారు. ఐఏఎస్ అధికారులు ఎగిరెగిరి పడుతున్నారు.. బిఆర్ఎస్ హయాంలో ఒక్క…
ఢిల్లీ – భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ కోరారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ నేతల బృందం కేటీఆర్ నేతృత్వంలో ఈసీ అధికారులతో సమావేశం అయింది. దేశంలో ఎన్నికల వ్యవస్థ, నూతన సంస్కరణలు, ఎన్నికల నియమావళి వంటి అంశాలపై కేంద్ర…