తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సబ్‌ప్లాన్‌ను కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
Bhatti Vikramarka Pays Tribute to Suravaram Sudhakar Reddy: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళి అర్పించారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌కు వెళ్లిన భట్టి.. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రజల కోసం ఆయన చేసిన సేవలను డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు. మనం ఓ గొప్ప నాయకుడిని కోల్పోయాం అని అన్నారు. చిన్న…
KTR : హైదరాబాద్ టెక్ హబ్‌గా వేగంగా ఎదుగుతోన్న నేపథ్యంలో, అంతర్జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో ప్రారంభించాలని భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (K.T. Rama Rao) విజ్ఞప్తి చేశారు. తాజాగా ఓపెన్ఏఐ సీఈవో శామ్ అల్ట్మన్ (Sam Altman) భారత్‌లో ఆఫీస్ ఏర్పాటు చేయాలని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో భారత్ పర్యటనకు వస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్…
KTR Slams Congress Govt over Urea Shortage: మాజీ సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో యూరియా కొరత ఎప్పుడూ రాలేదని, ఇప్పుడు పరిపాలన చేతకాని వారి వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ ముందుచూపు, పాలన అంటే ఏంటో జనాలకు ఇప్పుడు అర్థమైందని.. రైతును అరిగోస పెడుతున్న వారి పతనం ప్రారంభమైందన్నారు. నాడు కేసీఆర్ యూరియా కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించారన్నారు. వ్యవసాయ అధికారుల…
KTR has no Political Maturity Said Jagga Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీపై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనివాడు అంటూ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నీకు ఇప్పుడు చిల్లర పార్టీ అయ్యిందా? అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీ ఇంటికి వెళ్లి కలిశారు కదా?,…
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి విషయంలో గొడవలు ఇంటి నుంచి రోడ్డెక్కాయంటున్నారు. సింగరేణి ప్రాంతంలో బీఆర్ఎస్కు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఈ కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతూ వస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కోమటి రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీని డర్టీ పార్టీ అని మాట్లాడడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనం.. తెలంగాణ ఇచ్చిన పార్టీ నీకు థర్డ్ గ్రేడ్ పార్టీలా కనిపిస్తుందా..?.. నీ తండ్రిని అడుగు మా పార్టీ గురించి చెప్తాడు.. నీ తండ్రి కేసిఆర్, నువ్వు నీ కుటుంబం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దగ్గర గ్రూప్ ఫోటో దిగింది మర్చిపోయారా..?…
తెలంగాణలో యూరియా కొరతపై కేటీఆర్ విమర్శలకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఈ వారంలోనే రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖను కోరినట్లు మంత్రి తెలిపారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.