బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ విషం చిమ్మింది.. ఎన్నికల ముందు విష ప్రచారం చేసింది.. ఎన్నికల తరువాత కూడా కాళేశ్వరం పై కక్ష కట్టింది.. కాళేశ్వరం పై కక్ష కట్టి సిబిఐ విచారణ కు ఆదేశించారు.. వారం తిరగక ముందే మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తున్నాం అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు.. తల దగ్గర చేయాల్సిన శంఖుస్థాపన తోక దగ్గర చేస్తున్నారు.. మల్లన్న సాగర్ దగ్గర శంకుస్థాపనకు మొహం చెల్లక.. గండిపేట దగ్గర డ్రామా చేస్తున్నారు..
Also Read:Haryana: ఫరీదాబాద్‌లో ఘోరం.. ఏసీ పేలి ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు కుక్క మృతి
కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పిన వాళ్లే ఈరోజు అక్కడ నుంచి హైదరాబాద్ కు మంచి నీళ్ళు తెస్తున్నారు.. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా చేస్తున్నారు.. కాళేశ్వరం జలాలు తెస్తున్నారా లేదా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి.. ఇక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటూ విష ప్రచారం చేస్తున్నానందుకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.. లక్ష కోట్ల కుంభకోణం అని విమర్శలు చేశారు.. మొత్తం 94 వేల కోట్లు ఖర్చు అయితే 250 కోట్ల పని దగ్గర రిపేర్ లు వచ్చాయి.. కుంగిన చోట ఏజెన్సీ వచ్చి రిపేర్ చేస్తామంటే ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు.. అబద్ధాలు చెప్పినందుకు సీఎం రేవంత్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:Hamas-Israel: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్ చివరి హెచ్చరిక.. నెక్ట్స్ ప్లాన్ వెల్లడి
హైదరాబాద్ కు నీళ్లు తీసుకోస్తాం అంటున్న ఈ ప్రాజెక్టు లో చాలా పెద్ద కుంభకోణం ఉంది.. 11 వందల కోట్ల తో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు కు 7వేల నాలుగు వందల కోట్ల కు పెంచారు.. తక్కువ ఖర్చు తో పూర్తి అయ్యే దానిని పక్కకు పెట్టి ఎక్కువ ఖర్చు తో చేస్తున్నారు.. ఇందులో అవినీతి కోణం మాత్రమే కాదు క్రిమినల్ కోణం కూడా ఉంది.. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలడానికి కారణం అయిన కంపెనీ కే ఈ ప్రాజెక్టు ఇస్తున్నారు.. వాళ్లపై చర్యలు తీసుకోకుండా మళ్లీ కొత్త ప్రాజెక్టు ఇస్తున్నారు.. కేంద్రం బ్లాక్ చెసిన కంపెనీ కే మళ్ళీ కొత్త పనులు ఇస్తున్నారని ఆరోపించారు.