KTR: కవిత సస్పెన్షన్ తర్వాత.. మొదటిసారి మీడియా ముందుకు కేటీఆర్! ఏమన్నారంటే?
- బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కవిత సస్పెండ్
- పార్టీ లైన్ దాటడంతో కేసీఆర్ కఠిన నిర్ణయం
- కవిత సస్పెన్షన్ తర్వాత మొదటిసారి మీడియా ముందుకు కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ పార్టీ నుంచి కే.కవిత సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కొంతకాలంగా సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కవితపై గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. పార్టీ లైన్ దాటడంతో.. సొంత కూతురు అని కూడా చూడకుండా కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆ మరుసటి రోజే కవిత మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదటిసారి స్పందించారు.
కవిత వ్యాఖ్యలపై మాట్లాడాల్సిన అవసరం లేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నాం అని, మరలా మాట్లాడానికి ఏమీ లేదన్నారు. ఒకసారి ఆక్షన్ తీసుకున్నాక నిర్ణయంలో మార్పు ఉండదు అని చెప్పారు. కవితపై చర్యలు తీసుకున్నాక ఇక మాట్లాడేదేమి లేదని పేర్కొన్నారు. కవిత విషయంపై ఎక్కువగా మాట్లాడానికి కేటీఆర్ ఆసక్తి చూపలేదు. ఒక్క ముక్కలో కవిత సస్పెన్షన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాట్లాడారు. ప్రస్తుతం కేటీఆర్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న మూసీ నది పునరుజ్జీవం శంకుస్థాపనపై కేటీఆర్ విమర్శలు చేశారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ లేదా మల్లన్నసాగర్ వద్ద చేయాలని.. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గుండె కాయను వదిలిపెట్టి.. గండిపేట వద్ద చేస్తున్నారు. ఇవాళ గండిపేటకు మీరు తెస్తున్నది కాళేశ్వరం జలాలు కాదా?, మల్లన్న సాగర్ నుంచే నీరు హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారన్నారు. కాళేశ్వరం నీళ్లు వాడుకుంటూ తపైనే దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!