US-Israel-Iran Tensions: బాంబులు.. క్షిపణులు.. యుద్ధాలు..! భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు.. మరణాలు పెరుగుతాయా?
- ఆకాశంలో గర్జిస్తున్న క్షిపణులు
- భూమి వాతావరణానికి పెరుగుతున్న ముప్పు
- మానవాళి ముప్పునకు నిపుణులు హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Climate Crisis in War Zones: బాంబులు పేలుతున్నాయి.. క్షిపణులు దూసుకెళ్తున్నాయి.. యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తున్నాయి. ప్రపంచం మాత్రం ఇప్పటికీ యుద్ధాల మానవ నష్టాలనే లెక్కిస్తోంది. కానీ ఒక విషయం మాత్రం పెద్దగా చర్చలోకి రావడం లేదు. అదే యుద్ధాల వల్ల భూమి వాతావరణానికి జరుగుతున్న నష్టం. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-గాజా యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం లాంటి ఘర్షణలు కేవలం రాజకీయ లేదా భౌగోళిక ప్రభావాలకే పరిమితం కావడం లేదు. ప్రతి క్షిపణి ప్రయోగం, ప్రతి యుద్ధ విమాన ప్రయాణం భారీగా ఇంధనాన్ని కాల్చి వాతావరణంలో కార్బన్ ఉద్గారాలను పెంచుతోంది.
యుద్ధాల వల్ల ఎంత కాలుష్యం?
యుద్ధం వల్ల కలిగే పర్యావరణ నష్టాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని సంఖ్యలే చాలు. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం ఇజ్రాయెల్-గాజా యుద్ధం మొదటి 120 రోజుల్లోనే విడుదలైన కార్బన్ ఉద్గారాలు 26 దేశాల వార్షిక ఉద్గారాల కంటే ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు యుద్ధంలో ధ్వంసమైన భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలను తిరిగి నిర్మించడానికి అవసరమైన ఉద్గారాలను కూడా కలిపితే అది 135 దేశాల వార్షిక కార్బన్ ఉద్గారాలకు సమానం అని నివేదికలు చెబుతున్నాయి.
Also Read
- Indonesia Earthquake: ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Italy: ఇటలీలో భారీ ప్రమాదం.. డెలివరీ చేసిన 4 రోజులకే మునిగిన లగ్జరీ నౌక
- August 15 Independence Day: భారత్‌తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
- Modi-Rahman: బ్రిక్స్‌కు ముందే ఢిల్లీకి రెహమాన్.. మోడీతో బంగ్లాదేశ్ ప్రధాని కీలక భేటీ?
రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం:
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా ఇదే స్థాయిలో పర్యావరణ ప్రభావం చూపింది. యుద్ధం మొదలైన తర్వాత మూడు సంవత్సరాల్లోనే సుమారు 230 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆస్ట్రియా, హంగరీ, చెక్ రిపబ్లిక్, స్లోవాకియా దేశాల మొత్తం వార్షిక ఉద్గారాలకు సమానం. ఇందులో ట్యాంకులు, ఫైటర్ జెట్స్, భారీ తుపాకుల వినియోగం మాత్రమే కాకుండా యుద్ధం కారణంగా జరిగిన అడవి అగ్నిప్రమాదాలు కూడా పెద్ద పాత్ర పోషించాయి.
క్లైమేట్ రిపోర్టుల్లో లెక్కలే లేవు:
అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ భారీ ఉద్గారాల్లో చాలా వరకు అధికారిక క్లైమేట్ రిపోర్టుల్లో కనిపించవు. పారిస్ క్లైమేట్ ఒప్పందం ప్రకారం సైనిక కార్యకలాపాల వల్ల వచ్చే కార్బన్ ఉద్గారాలను నివేదించడం తప్పనిసరి కాదు. అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు భారీగా కార్బన్ విడుదల అయినా కూడా అవి చాలా వరకు ప్రపంచ క్లైమేట్ లెక్కల్లో చేరవు.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ప్రమాదం:
ప్రస్తుతం ప్రపంచ దృష్టి మధ్యప్రాచ్యంపై ఉంది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ రిఫైనరీలు, గ్యాస్ ప్లాంట్లు, ఇంధన నిల్వ కేంద్రాలు ఉన్నాయి. వీటిపై దాడులు జరిగితే కేవలం కార్బన్ డయాక్సైడ్ మాత్రమే కాదు.. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, విషపూరిత కణాలు కూడా వాతావరణంలోకి విడుదల అవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్ అయిన ఇరాన్‌లోని సౌత్ పార్స్ ప్రాంతం కూడా ఉద్రిక్తతల కేంద్రంగా మారింది. అక్కడ పెద్ద స్థాయి దాడి జరిగితే పర్యావరణానికి భారీ నష్టం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌పై కూడా ప్రభావం:
ఈ పరిస్థితుల్లో భారత్ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. భారత్ వినియోగించే క్రూడ్ ఆయిల్‌లో దాదాపు 85 శాతం దిగుమతులే.. అందులో ఎక్కువ భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. అక్కడ సరఫరా అంతరాయం ఏర్పడితే భారత్ మళ్లీ బొగ్గు వినియోగం వైపు వెళ్లే అవకాశం ఉంది. అయితే బొగ్గు అత్యధిక కార్బన్ ఉద్గారాలు విడుదల చేసే ఇంధనం కావడంతో ఇది భారత్ క్లైమేట్ లక్ష్యాలను కూడా ప్రభావితం చేయవచ్చు.
ఇక యుద్ధాలు పూర్తిగా ఆగిపోవడం కష్టం. కానీ ఒక ప్రశ్న మాత్రం ప్రపంచం ముందుంది. యుద్ధాల వల్ల భూమి వాతావరణానికి జరిగే నష్టాన్ని ఎందుకు అధికారికంగా లెక్కలోకి తీసుకోవడం లేదు? ఎందుకంటే ఒకసారి అది లెక్కలోకి వస్తే యుద్ధాల అసలు ఖర్చు ఎంత పెద్దదో ప్రపంచం గుర్తించాల్సి వస్తుంది.
తాజావార్తలు
-
PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
-
Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
-
PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. ‘అర్బన్ నక్సల్స్’ను సమాజం దూరం పెట్టాలి..
-
Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
-
IND vs SL: మరోమారు సర్ఫరాజ్ ఖాన్‌కు మొండిచేయి.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్..!
ట్రెండింగ్
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!