ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన…
Konda Surekha vs KTR : హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకోబడగా, BNSS సెక్షన్ 222 r/w 223 ప్రకారం నేరాన్ని స్వీకరించాలని కోర్టు నిర్ణయించింది. కోర్టు ఆదేశాల…
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కలవరపెడుతున్న వరుస ఘటనలు దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో అధ్యాపకుల వేధింపులు కారణంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటలు రోజురోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐఐటీ-బాంబేలో 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి……
KTR: హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. ఈ పోస్టులో.. తెలంగాణ రాష్ట్రాన్ని ఫైల్స్‌తో కాకుండా.. ఫ్లైట్ బుకింగ్స్‌తో నడిపిస్తున్నారని ఆరోపించారు.
ఓపెన్ విత్ కేటీఆర్ బైట్ చారి గురించి చెప్పింది చిన్నగా ఈ మాటలే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఈ మాటలే ఇప్పుడు భూపాలపల్లి కారులో తీవ్ర దుమారం రేపుతున్నాయట.
ఇటీవల బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. “కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా?” అని ప్రశ్నించారు. అలాగే, “నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. కేవలం 300 ఓట్ల మెజారిటీతో గెలిచిన విషయం నీకు తెలుసు. నీ…
యూనస్ షేక్ హసీనాకు భయపడుతున్నారా..? మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్‌ను విడిచిపెట్టి ఏడాది అయింది. ఆమె పార్టీ అవామీ లీగ్, స్టూడెంట్స్ లీగ్‌లను బంగ్లాలో నిషేధించారు. అయినప్పటికీ.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ మనస్సులో షేక్ హసీనా భయం తొలగిపోయినట్లు కనిపించడం లేదు. మొహమ్మద్ యూనస్ మరోసారి షేక్ హసీనా పార్టీపై ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు అవామీ లీగ్ దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఆరోపించారు. ఉద్యోగులకు టీసీఎస్ భారీ షాక్.. 12,000…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీల హక్కుల విషయంలో కేసీఆర్ తప్ప మరెవ్వరూ నిజాయితీగా న్యాయం చేయలేరని స్పష్టం చేశారు. పరకాలలోని లలితా కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్టుమిషన్లు, కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు…
Govt School Teacher Suspended in Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎన్పీ వాడ జడ్పీహెచ్ఎస్లో విధులు నిర్వర్తిస్తున్న ఆర్కె ప్రసాద్ అనే ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు శనివారం సస్పెండ్ చేశారు. ఈ నెల 24న మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహించినందుకు గాను గవర్నమెంట్ స్కూల్ టీచర్‌పై వేటు పడింది. ఈ ఘటనను విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను రాజకీయ కార్యక్రమాలకు వేదికగా మార్చడంపై సోషల్ మీడియాలో…