హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిందితులను సీఐడీ కస్టడీకి అనుమతి. ఇవాళ నిందితులను 6 రోజుల పాటు కస్టడీకి తీసుకోనన్న సీఐడీ. నేడు భద్రాద్రి జిల్లాలో మంత్రులు పొంగులేటి, సీతక్క పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇల్లందులో మహిళల రుణాల పంపిణీ. ఢిల్లీ: నేడు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా స్వచ్ఛసర్వేక్షన్ అవార్డులు. వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్ర నిలిపివేత. అమర్నాథ్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు. ఒకరు మృతి, 10 మందికి…
KTR : ఢిల్లీలో జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ముసుగు వీడింది. నేటితే అసలు గుట్టు బయట పడింది. తెలంగాణ నిధులను రాహుల్ గాంధీకి, నీళ్లను చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి రేవంత్ రెడీ అయ్యారంటూ మండిపడ్డారు కేటీఆర్. ఈ రోజు జరిగిన మీటింగ్ లో అసలు బనకచర్ల ప్రస్తావన రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసలు ఏపీ మొదటి ప్రతిపాదనే…
KTR : రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి పదే పదే మేడిగడ్డ బరాజ్ కూలిందంటున్నారు.. దమ్ముంటే అదే మేడిగడ్డ మీద కూర్చుని చర్చపెడుదాం వస్తావా అంటూ సవాల్ విసిరారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్ లో బుధవారం జరిగిన దళిత బంధు సాధన సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య సీఎం రేవంత్ రెడ్డి తన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి పదే పదే మేడిగడ్డ కూలిందంటున్నాడు.…
KTR : రాష్ట్రంలో విద్యార్థుల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన కల్తీ ఆహార ఘటనలు, విద్యార్థుల మృతుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఒకే ఏడాది కాలంలో వేలాది మంది విద్యార్థులు కల్తీ ఆహారంతో అనారోగ్యం పాలవడం, 100 మందికిపైగా విద్యార్థులు మృతిచెందడం దారుణమని కేటీఆర్ విమర్శించారు. ఇది ప్రభుత్వ పరిపాలనలో ఘోరమైన…
విదేశాల్లో మగ్గుతున్న నా కొడుకులను రక్షించాలని మహిళ విజ్ఞప్తి.. వెంటనే స్పందించిన పవన్ కల్యాణ్.. సమస్య అంటూ తన దగ్గరకు వచ్చినా.. సాయం అంటూ విజ్ఞప్తి చేసినా.. వెంటనే స్పందించేవాళ్లలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకరు.. ఇప్పుడు, మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో మగ్గుతున్న తమ కుమారులను రక్షించాలంటూ ఓ మహిళ విజ్ఞప్తి చేయడంతో వెంటనే స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యవహారాన్ని వెంటనే కేంద్ర విదేశీ వ్యవహారాల…
BRS: తెలంగాణ రాష్ట్ర హక్కులు, పరిరక్షణ, గుర్తింపుల కోసం బీఆర్ఎస్ నేతలు లేఖల పర్వం కొనసాగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చర్యలపై నిరసనగా, వారు మళ్లీ గళమెత్తారు. ఇటీవల పార్టీ కార్యనాయకులు రెండు కీలక లేఖలు రాశారు.. ఒక్కటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, మరొకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడికి రాసిన లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విదేశాల్లో చల్లదనం కోసం పోతున్నారు అని అన్నారు. నెలలో 20 రోజులు విదేశాల్లో కేటీఆర్‌కి ఏం పని అని ప్రశ్నించారు. కేసీఆర్ కోటాలో కేటీఆర్ డైరెక్ట్ ఎమ్మెల్యే అయిపోయాడు అని, రాజకీయ ఒడిదుడుకులు ఆయనకేం తెలుసు? అని మండిపడ్డారు. తాము ఎన్నో వ్యవప్రయాసలతో రాజకీయ నేతలం అయ్యాం అని చెప్పారు. తమకున్న అనుభవాల ముందు కేటీఆర్ జీరో…
Minister Seethakka : బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై మంత్రి సీతక్క మండిపడ్డారు. మంగళవారం ములుగు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనిపై తప్పుడు ప్రచారం చేస్తూ, వ్యక్తిగత దాడులకు దిగితే కేటీఆర్ నాశనం తప్పదని హెచ్చరించారు. ” మీ చెల్లి నీ మీద దుమ్మెత్తి పోస్తుంది.. ఆమె పరిస్థితిని గమనించు కేటీఆర్!” అంటూ ఆమె ఫైర్ అయ్యారు. చిల్లర రాజకీయాల నుంచి బయటపడాలని హితవు పలికిన సీతక్క, “నువ్వు నిర్వహించిన…
KTR: తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ రంగంపై ఎవరు ఏం చేశారనే అంశంపై ఓపెన్ డిబేట్‌కు సవాల్ విసరగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ సవాల్‌ను స్వీకరించారు. సీఎం ఎక్కడైనా వేదికను సూచిస్తే తాను చర్చకు సిద్ధమని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించారు. Kingdom : కింగ్డమ్.. హిందీ…
తెలంగాణ భవన్లో మెదక్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా కేటీఆర్ సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “సిద్దిపేట అంటే పందులు గుర్తుకు వచ్చేవి.. మెదక్ అంటే గాడిదలు గుర్తుకు వస్తాయని హరీష్ రావు చెప్పారు.. సిద్దిపేటలో పందులు మాయం అయ్యాయి కానీ మెదక్‌లో మాత్రం ఇంకా కొన్ని గాడిదలు ఉన్నాయి.. వాటి సంగతిని బీఆర్ఎస్ కార్యకర్తలు చూసుకుంటారు.. రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చింది. రేవంత్…