తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత…
కవితకు భాగస్వామ్యం లేకుండా అవినీతి జరిగిందా కవిత రాజీనామాపై తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత కొన్ని కఠోర సత్యాలు, కొన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారని ఆయన అన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో కీలక స్థానంలో ఉన్న కవితకు అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం లేకుండా అవి జరిగాయని అనటం అసాధ్యమని విమర్శించారు. ప్రజల సొమ్ము దోచుకున్న తర్వాత, వాటాలో తేడా రావడంతోనే కవిత బహిరంగ వేదికపైకి వచ్చారని మహేష్ గౌడ్…
సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు.
మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ అని విమర్శించారు. ఆయనే (హరీష్ రావు) సమస్య పరిష్కరించినట్టు, పార్టీని గెలిపించినట్టు డ్రామా చేస్తారన్నారు. నాన్నపై సీబీఐ కేసు వచ్చిందంటే దానికి కేవలం హరీష్ రావే కారణం అని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమం డే-1 నుంచి హరీష్ రావు లేరని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. మంగళవారం ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన విషయం…
కొందరు బీఆర్ఎస్ నేతలు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. తన సొంత అన్నయ్య, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ని తనపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నా అని తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించరా?.. 103 రోజులైనా కేటీఆర్ అడగరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు పెట్టి తీహార్ జైలులో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక కూడా.. గతేడాది నవంబర్ 23 నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో…
ఈరోజు, రేపు రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునిచ్చారు. కేటీఆర్ పిలుపు నేపథ్యంలో ధర్నాలు, రాస్తారోకాలు, బైక్ ర్యాలీలు.. తదితర రూపాల్లో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. ఈరోజు ఉదయం పార్టీ శ్రేణులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ధర్నాలకు పిలుపునిచ్చారు. Also Read: Kaleshwaram Project:…
తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లెక్కలు వేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తాను ఢిల్లీకి పోయేది.. మాజీ సీఎం కేసీఆర్ తెచ్చిన 11.5 వడ్డీ రేటును 7.25కి కుదించడానికే వెళ్లాలని స్పష్టం చేశారు. కేసీఆర్ చేసిన అప్పుల చరిత్ర కూడా అందరికీ తెలియాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కోసం రూ.87,449 కోట్లు అప్పు తెచ్చారన్నారు. 11.5 వడ్డీతో 14 ఏళ్లకు కేసీఆర్ అప్పు తెచ్చాడని.. యూబీఐ, నాబార్డు…
శాసనసభలో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లు సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీల కోసం గతంలో కేసీఆర్ అనేక పోరాటాలు చేశారు.. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి.. తిరిగి తెలంగాణలోనే అడుగు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు కేసీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. బీసీ బిల్లు సాధించుడో.. లేకపోతే ఢీల్లీ నుంచి తెలంగాణకు రాను అని అక్కడే జంతర్ మంతర్ లో కూర్చుని ఆమరణ నిరాహార దీక్ష చేయమనండి అని తెలిపారు. ప్రధానమంత్రి…