KTR : తులం బంగారం కాదు.. తులం ఇనుము కూడా ఇవ్వరు
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను సొంత పోరాటంగా భావించాలన్న కేటీఆర్
- కాంగ్రెస్ నాయకులపై డబ్బు వసూళ్ల ఆరోపణలు
- మైనారిటీ నాయకులకు టికెట్లు ఇవ్వలేదని కాంగ్రెస్‌పై విమర్శలు
- బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను ప్రతి కార్యకర్త తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ నాయకులు ‘హైడ్రా’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆ డబ్బులతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు కొనాలని చూస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ నాయకులు దొంగ ఓట్లను రాయించారని, వాటిని తొలగించే బాధ్యతను బీఆర్ఎస్ నాయకులు తీసుకోవాలని సూచించారు. అక్టోబర్ చివరి వారంలో గానీ, నవంబర్ మొదటి వారంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని, బీహార్‌తో పాటు ఈ ఎన్నికలు రాబోతున్నాయని చెప్పారు.
Also Read
Nara Lokesh: ఖాట్మండులో చిక్కుకున్న వారిని క్షేమంగా తీసుకొస్తాం..!
కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు జిల్లాల్లో ప్రజలు మోసపోయారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడలో పుస్తెలను గుంజుకెళ్లే వాళ్ళు అంటూ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా ఇవ్వడని ఎద్దేవా చేశారు. బతుకమ్మ, దసరా పండుగల ముందు ప్రజల వద్దకు వెళ్లి వారి అవసరాలు తీర్చాలని కార్యకర్తలకు సూచించారు.
గతంలో మైనారిటీ నాయకుడైన అజారుద్దీన్‌కు సీటు ఇచ్చి, ఇప్పుడు ఆయనకు టికెట్ ఇవ్వకుండా బాగా డబ్బులు ఉన్నవారికి ఇస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు వారు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు పైసలు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం తమకే వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
Kishkindhapuri : కిష్కింధపురి.. ఆడియెన్స్ కు నచ్చకుంటే ఇండస్ట్రీ వదిలి వెళ్తా : బెల్లం కొండ
తాజావార్తలు
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!