రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు రేపు పర్యటించనుంది. ఎత్తిపోతల వద్ద పనులు జరుగుతున్నదీ లేనిదీ తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ బోర్డును ఇప్పటికే ఆదేశించింది. తొలుత తెలంగాణ అక్రమంగా నిర్మిస్తున్న పథకాలను చూసి రావాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్‌జీటీ ఆదేశాల మేరకు పర్యటించి నివేదిక సమర్పించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. ఐతే..బోర్డు పూర్తిస్థాయి సమావేశం ఏర్పాటు చేయకుండా నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని ఏపీ అభ్యంతరం చెప్పింది. ఐతే..రేపు కేఆర్ఎంబీ పర్యటించనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. బోర్డు బృందంతో పాటు తెలంగాణకు చెందిన న్యాయవాదులు..ఇతర ప్రతినిధులు రావటానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.