తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలను పరిష్కరించాలన్న ఉద్దేశంతో.. గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డులకు విస్తృత అధికారులు కల్పిస్తూ.. వాటి పరిధిలను నిర్ణయిస్తూ గెజిట్ విడుదల చేసింది కేంద్రం.. అయితే, దీనిపై భిన్నమైన వాదనలే ఉన్నాయి.. ఇక, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు పరిష్కారం కాకపోవడం.. ఫిర్యాదుల పర్వం కొనాగుతూనే ఉన్నందున.. ఈ నెల 9న జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ ఉమ్మడి సమావేశం నిర్వహించాలని నిర్ణయించాయి.. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌శాఖ అధికారులకు ఉమ్మడిగా లేఖలు రాశాయి రెండు బోర్డులు…
ఈ నెల 9వ తేదీన కృష్ణా, గోదావరి నది యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం హైదరాబాద్‌లోని జలసౌధలో జరగనుంది.. తాజా పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేశాయి రెండు బోర్డులు.. కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాల అమలు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.. దీనిపై రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు అధికారులు. కాగా, కేంద్రం గెజిట్ పై ఇరు రాష్ట్రాల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.. తెలంగాణ మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తుండగా.. అందులోని కొన్ని అంశాలు తమక వ్యతిరేకం అంటోంది ఏపీ సర్కార్. మరి ఈ సమావేశాకి ఇరు రాష్ట్రాల అధికారులు హాజరు అవుతారా..? ఎలాంటి చర్చ సాగుతుంది.. అనేది ఆసక్తికరంగా మారింది.