కృష్ణా జలాల పంపకం పై కేఆర్ఎంబీకి ఏపీ లేఖ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
70:30 నిష్పత్తిలోనే కృష్ణా జలాల పంపకం జరగాలని కేఆర్ఎంబీకి ఏపీ లేఖ రాసింది. కృష్ణా జల వివాదాల రెండో ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం 2021-22 నీటి సంవత్సరానికి ఏపీకి 70 శాతం.. తెలంగాణకు 30 శాతం మేర నీటి పంపకం చేయాలని కేఆర్ఎంబీకి ఏపీ సూచించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటి పంపకాలను ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయలేదని లేఖలో స్పష్టం చేసింది ఏపీ. ఉమ్మడి ఏపీలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి చెన్నైకి, హైదరబాద్ నగరానికి తాగునీటి సరఫరా విషయంలో మాత్రమే కొన్ని నిబంధనల్ని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. నాగార్జున సాగర్ లో విద్యుత్ ఉత్పత్తి, సాగునీటి అవసరాల కోసం ప్రకాశం బ్యారేజీకి నీటి సరఫరా విషయంలో మాత్రమే ఉమ్మడి ఏపీలో ప్రాజెక్టుల వారీగా కొన్ని నిర్ణయాలు చేసినట్టు స్పషం చేసింది.
ఇక ఏపీ పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్ర అవసరాల కోసం 1059 టీఎంసీల కావాలని ట్రైబ్యునల్ కు విజ్ఞప్తి చేసినట్టు గుర్తు చేసిన ఏపీ… ఈ దశలో 50-50 నిష్పత్తిలో నీటి పంపకాల కోసం తెలంగాణ డిమాండ్ సహేతుకం కాదు అని తెలిపింది. తెలంగాణ డిమాండుపై ఏపీ అభిప్రాయం కోరింది కేఆర్ఎంబీ. ఈ మేరకు కేఆర్ఎంబీకి ఏపీ ప్రత్యుత్తరం పంపింది.
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్లో సంచలన నిజాలు..
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!