తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది.. ఫిర్యాదులు, లేఖలు నడుస్తూనే ఉన్నాయి.. తాజాగా కేఆర్‌ఎంబీ చైర్మన్ కు మరోలేఖ రాసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ… బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం మాత్రమే.. దాని నుండి కృష్ణా బేసిన్ ఆవలకు నీటి మల్లింపును ట్రిబ్యునల్ అనుమతించలేదని.. హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్టు నుండి బేసిన్ ఆవలకి నీటి తరలింపు వల్ల బేసిన్ లోని తెలంగాణ ప్రాజెక్టులు నష్టపోతాయని కేఆర్‌ఎంబీ దృష్టికి తీసుకెళ్లారు..
నది ఒడ్డున ఉన్న తెలంగాణ ప్రాంతాలను కాదని బేసిన్ ఆవల 700 కిలోమీటర్ల దూరంలో నీటిని తరలించడం అన్యాయమని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.. బ్రిజేష్ ట్రిబ్యునల్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్ తదితర ప్రాజెక్టులకు బేసిన్ ఆవలికి మళ్లిస్తాయి కాబట్టి కేటాయింపులు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్టు ద్వారా TBHLC ప్రాజెక్టు కంటే ఆవలకు తీసుకుని వెళ్లడం ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకమని పేర్కొంది.. మిగులజలాలపై బేసిన్ ఆవలకు తీసుకెళ్లే హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ప్రాజెక్టునే వ్యతిరేకిస్తూ ఉంటే, ఇప్పుడు హెచ్‌ఎన్‌ఎస్ఎస్ ను 3850 క్యూసెక్కుల నుండి 6300 క్యూసెక్కుల కు పెంచడం అక్రమని లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ.