Ap- Telangana : ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంల భేటీ స్టార్ట్ అయింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ తో పాటు తెలంగాణ ప్రతిపాదించిన పది అంశాలపై కూడా చర్చ జరగబోతోంది. ఈ మీటింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికి ఒకరు బొకేలు ఇచ్చుకుని శాలువాలు కప్పుకున్నారు. ఈ సమావేశంలో సీఎంలతో…
Telangana Water Rights: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలని, న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాల సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కృష్ణాపై తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని, నీటి కేటాయింపులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ శ్రీశైలం వెళ్లనున్నారు. కృష్ణా నదికి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది.
Jurala : ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో తెలంగాణలో గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు శనివారం రాత్రి ప్రాజెక్టులోని 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,30,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చుండగా, 1,44,076 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూరాల డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 318.518 మీటర్లు…
యోగాని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలం... యోగాంధ్ర- 2025లో భాగంగా వరల్డ్ రికార్డ్ సాధించేందుకు యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ - ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్.. ఇక…
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని... తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో…
పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. Also Read:Bengaluru:…