Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది. మొంథా తుఫాన్ ఎఫెక్ట్ బలంగా పడింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. అందులోనూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షాలు ఎడతెరిపిలేకుండా కురుస్తున్నాయి. పై నుంచి మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భాదరీగా వరద నీరు, వర్షపునీరు రావడంతో సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులో 20 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. 16 గేట్లు 10 అడుగులు,…
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును 519 అడుగుల నుంచి 524 అడుగులకు పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచితే తెలంగాణకు జరిగే నష్టంపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే సీఎం రేవంత్ సొంత జిల్లాకు చుక్క నీరు కూడా రాదని చెప్పారు. దక్షిణ తెలంగాణ లోని ఐదు జిల్లాలకు కృష్ణానది వర ప్రదాయిని అని అన్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఆల్మట్టి…
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులను, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.
కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ - నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు..
కృష్ణమ్మ పరుగులు తీస్తోంది.. కృష్ణా బేసిన్ లోని అన్ని ప్రాజెక్టులు నిండిపోవడంతో.. ప్రకాశం బ్యారేజీ వైపు పరుగులు తీస్తోంది కృష్ణమ్మ.. అయితే, అంతకంతకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో.. అధికారులు అప్రమత్తం అయ్యారు.. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం పెరుగుతోన్న నేపథ్యంలో.. మొత్తం 70 గేట్లను ఎత్తివేశారు అధికారులు..
Prakasam Barrage Flood Alert: ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నుంచి వరద నీరు ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నదీపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరదకు అనుగుణంగా అధికారులు నీటిని విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
CM Revanth Reddy : ఢిల్లీ వేదికగా నేడు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు కీలక విషయాలపై చర్చించారు. ఆ విషయాలను తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసలు ఏపీ గోదావరి-బనకచర్ల విషయాన్ని మీటింగ్ లో పెట్టలేదు. బనకచర్ల కడుతామని ఏపీ మీటింగ్ లో చెప్పలేదు. అలాంటప్పుడు అది కట్టొద్దని మేం మీటింగ్…
Telangana : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభం అయింది. ఈ మీటింగ్ లో ఏపీ పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించింది. తెలంగాణ మాత్రం పది అంశాలను ప్రతిపాదించింది. ఇందులో చూసుకుంటే 1.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలి. 2. శ్రీశైలం నుంచి వేరే బేసిన్ కి నీటి తరలింపు…