పండగ పూట కృష్ణ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా నదిలో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట వద్ద కృష్ణా నదిలో స్నానానికి దిగి మోదుముడి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. గల్లంతయిన యువకులు మత్తి వర్ధన్ (16), s/o బావన్నారాయన, మత్తి కిరణ్ (15) s/o రంగారావు, మత్తి దొరబాబు (15) s/o వరదరాజులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read:Bengaluru: భార్యపై అనుమానం.. నడిరోడ్డుపై గొంతు కోసి చంపిన భర్త..
ముగ్గురిలో ఒకరు మృతిచెందగా నదిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి కోసం కృష్ణ నదిలో గాలింపు చేపట్టారు అధికారులు. కిరణ్ మృతదేహం లభ్యమవటంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ విషాద ఘటనతో మోదుమూడి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.