ఎగువ నుంచి కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ కు పులిచింతల ప్రాజెక్ట్, మున్నేరు, పాలేరు, కట్లేరు ప్రాంతాల నుంచి ఈరోజు సాయంత్రానికి సుమారు లక్ష క్యూసెక్స్ వరకు వరద నీరు చేరనుంది. వరద ఉధృతి పై అధికారులను మరింత అప్రమత్తం చేసారు కృష్ణా జిల్లా కలెక్టర్ జె. నివాస్. అయితే ప్రస్తుతo ఇన్ ఫ్లో 33,061 అవుట్ ఫ్లో 31,500 క్యూసెక్కులుగా ఉంది. వరద ముంపు ప్రభావిత అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్…
కృష్ణా నది జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం సాగగా… కేంద్ర ప్రభుత్వం గెజిట్లతో వివాదాలకు తెరదింపాలని చూసింది.. కానీ, వాటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మరోవైపు.. కృష్ణా నదీ జలాలను 50:50 నిష్పత్తిలో పంచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డును లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ ఛీప్ మురళీధర్‌రావు కేఆర్‌ఎంబీ ఛైర్మన్‌కు…
కృష్ణా, గోదావరి నదుల నిర్వహణ బోర్డులకు సంబంధించి రెండు గెజట్ నోటిఫికేషన్లను జారీ చేయనుంది కేంద్ర ప్రభుత్వం.. రేపు మధ్యాహ్నం 1.45 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ.. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ గెజిట్ నోటిఫికేషన్లు 2014లోనే విడుదల చేయాల్సి ఉండగా, అనేక అవాంతరాలతో.. ఇప్పటికే విడుదలకు సిద్ధమయ్యాయి.. ఇటీవల తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత ముదరడంతో.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం రోజురోజుకీ ముదురుతోంది.. ఓ వైపు మాటల యుద్ధం.. మరోవైపు ప్రధానికి, కేంద్ర మంత్రులకు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లింది.. ఇప్పుడు కృష్ణజలాల వివాదంపై సుప్రీంకోర్టుకువెళ్లే యోచనలో ఉంది ఏపీ సర్కార్… సుప్రీంలో పిటిషన్ దాఖలుకు కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. అంతర్‌రాష్ట్ర నదులపై ఉన్న ప్రాజెక్టులను, విద్యుత్ కేంద్రాలను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని, నిర్వహణ, భద్రత బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించాలని, తక్షణమే…
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం ఇప్పటికే నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లు వేయడానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులతో సమన్వయ బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తీసుకోవాలన్నారు. ఇటీవల నెల్లికల్లులో శంఖుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి , కాల్వల నిర్మాణం, పంపుల…