TG ENC: “ఏపీలో ఆ ప్రాజెక్టును ఆపండి”.. గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ లేఖ..
- గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు..
- తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ లేఖ
- లేఖలో గోదావరి - బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) లేఖ రాసింది. గోదావరి – బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని లేఖలో పేర్కొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ప్రాజెక్టు చేపడుతున్నారని గతంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపామని ఈఎన్సీ వెల్లడించింది. పనులు విభజన చట్టం, ట్రైబ్యునల్ అవార్డులకు విరుద్ధమని… తెలంగాణకు నష్టం జరుగుతుందన్న ఈఎన్సీ తెలిపింది.
READ MORE: Ishan Kishan Match Fixing: మనోడు కాదు, పగోడు.. ఇషాన్ ఇంకా ముంబై ఇండియన్స్‌కే ఆడుతున్నాడు!
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఈ నెల ఏడో తేదీన జరిగిన జీఆర్ఎంబీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించామంది. ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆ రోజు జీఆర్ఎంబీ ఛైర్మన్, ఏపీ సభ్యులు సమాధానం ఇచ్చారని తెలిపింది. కానీ, మరుసటి రోజే గోదావరి – బనకచర్ల లింక్ కోసం ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పోరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ ఈఎన్సీ పేర్కొంది. “ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించి ఏపీని నిలువరించాలి. పోలవరం ప్రాజెక్టు, తాడిపూడి ఎత్తిపోతల పథకాలపై ఇందుకు సంబంధించిన ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టవద్దు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ లో వాదనలు జరుగుతుండగా… జలాల మళ్లింపు కోసం ఉత్తర్వులు ఇవ్వరాదు. ఏపీ జారీ చేసిన జలహారతి కార్పోరేషన్ ఉత్తర్వులను నిలిపివేసేలా చూడాలి.” అని తెలంగాణ ఈఎన్సీ లేఖలో స్పష్టం చేసింది.
READ MORE: Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!