ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజిలోని 67,69,70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల మరమ్మతులను పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీలుతో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు.
ప్రకాశం బ్యారేజీపై కౌంటర్ వెయిట్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.. హైదరాబాద్ నుంచి తెప్పించిన కౌంటర్ వెయిట్ లు ప్రకాశం బ్యారేజీ 67 ,69 గేట్లకు బిగిస్తున్నారు... గడిచిన వారం రోజులుగా వరదల నేపథ్యంలో, ఇసుకతో నిండిన పడవలు ప్రకాశం బ్యారేజీను ఢీకొట్టడం, బ్యారేజీకి సంబంధించిన కౌంటర్ వెయిట్ లు దెబ్బ తినటం, వంటి అంశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది..
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ రోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేరుకున్న కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అధికారును అడిగి తెలుసుకున్నారు.
పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల నేపథ్యంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ దాదాపు నిండుకుండల్లా మారిపోయాయి. శ్రీశైలం, నాగార్జున జలాశయాలు పూర్తిగా నిండిపోగా.. గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.
బెజవాడ వాసులు క్రమంగా ఊపిరి పీల్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ప్రకాశం బ్యారేజీకి గంట గంటకూ వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా వరద తగ్గుతోంది.. మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రాగా.. రాత్రి 9 గంటల వరకు ప్రకాశం బ్యారేజీకి 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గింది ఇన్‌ఫ్లో..
కృష్ణానది వరద 12 లక్షల క్యూసెక్కులు చేరుతుందనే అంచనా నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో ఆందోళన మొదలైంది.. ప్రకాశం బ్యారేజ్ దిగువున ఉన్న విజయవాడ సిటీ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డలకు ముప్పు వంచిఉన్న నేపథ్యంలో.. పెరుగుతున్న వరద దెబ్బకి వణికిపోతున్నారు జిల్లా వాసులు.
Second Alert: కృష్ణానది వరద నీటి ఉధృతితో ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11,39,351 క్యూసెక్కలుగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడకు కేంద్రం నుంచి ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. కృష్ణా నది వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో.. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ప్రభావిత ప్రాంత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేస్తు్న్నారు. .. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్ ఫ్లో 2,86,434 క్యూసెక్కులు ఉండగా.. 10 గేట్లు ఎత్తడంతో ఔట్ ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది.