Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్..
ఇక మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై “జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ” (NDSA) ఇప్పటికే నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మేడిగడ్డ డిజైన్, ఆపరేషన్‌లో లోపాలున్నాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్.. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సరైన మార్గాలను అన్వేషిస్తున్నాం అని పేర్కొన్నారు. డీపీఆర్‌లో చూపిన స్థలం ఒకటి కాగా, అసలు నిర్మాణం వేరే ప్రాంతంలో జరిగిందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్సీ సూచించిందని చెప్పారు.
Read Also: Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
అలాగే నూతన నిర్మాణాలు, కేటాయింపులపై ఆయన చర్చించారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అలాగే తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇంకా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసిల నీటిని త్వరితగతిన కేటాయించాలని కోరారు. వీటితోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టీఎంసిలు అవసరమని, తక్షణమే 45 టీఎంసులను ముందుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ముఖ్యంగా కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు నదిపై వివిధ ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రమాదం ఉందని పేర్కొంటూ రిటెన్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.