MP Kesineni Chinni: కృష్ణానదిపై యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాతో ప్రపంచ రికార్డుకు ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మెగా ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. యోగా భారతీయ వారసత్వ సంపద.. ఈ యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం.. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2025 నిర్వహిస్తుంది అని వెల్లడించారు.
Read Also: Pooja Hegde : విజయం కోసం కాస్త ఓపిక పట్టాలి..
అయితే, యోగాని నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని సూచించారు. అప్పుడే ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలం… యోగాంధ్ర- 2025లో భాగంగా వరల్డ్ రికార్డ్ సాధించేందుకు యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్ లో పాల్గొన్న వారికి అభినందనలు తెలియజేస్తున్నాను.. ఇటీవల విజయవాడలో జరిగిన డ్రోన్ షోలో వరల్డ్ రికార్డ్ సృష్టించాం.. ఇప్పుడు యోగాతో మరో వరల్డ్ రికార్డ్ సృష్టించబోతున్నామని కేశినేని చిన్ని తెలిపారు.