టీఆర్ఎస్ కు మాజీ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కేసీఆర్కు నర్సయ్య గౌడ్ లేఖ రాశారు. మీపై అభిమానంతో కృతజ్ఞతగా ఇప్పటివరకు పార్టీలో ఉన్నానని స్పష్టంచేశారు. అభిమానం, బానిసత్వానికి చాలా తేడా ఉందని లేఖలో పేర్కొన్నారు.
Mulayam Singh Yadav: ఉత్తర ప్రదేశ్ ఇటావా జిల్లాలోని సైఫయా గ్రామంలో సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరై ములాయం భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ను కేసీఆర్ పరామర్శించారు. ములాయం అంత్యక్రియల్లో కేసీఆర్తో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ కూడా…
బీజేపీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. 18వేల కోట్ల కాంట్రాక్టులు వదులుకో లేదంటే.. హైదరాబాద్ భాగ్యలక్ష్మి గుడికి రా.. మీ గుండు సంజయ్ మీద ఒట్టు వెయ్యి కాంట్రాక్టులు రాలేదని అంటూ ఛాలెంజ్ చేశారు.
ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో.. నేడు రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏల నిరసన చేపట్టారు.
బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు అనే బండి సంజయ్ వ్యాక్యలకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
TRS పై నేను వేసిన పిటిషన్ విచారణ పూర్తి అయ్యే వరకు BRSగా పేరు మారదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు.
మోటార్లు కావాలా? మీటర్లు కావాలా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవానలి మంత్రి హరీశ్ రావ్ అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ఎన్నిక ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష అని అన్నారు. కోట్లు పెట్టి ప్రజలను కొనాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు.
మునుగోడు ఎన్నికల్లో మేము పోటీ చేస్తున్నాం, త్వరలో అభ్యర్థిని ప్రకటిస్తామని TJS అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. ఢిల్లీలో కేసీఆర్ కే కాదు మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు.
మెదక్ జిల్లాలో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ నెల 9న నర్సాపూర్ లో జరగబోయే బీజేపీ బహిరంగ సభ ఏర్పాట్లను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిశీలించారు.