రేపు మధ్యాహ్నం 12.37 నుంచి 12.47 మధ్య BRS ఢిల్లీ కార్యాలయం ప్రారంభం అవుతుందని. ముందుగా పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించనున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రేపు మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయయన్నారు. ఆ ముహూర్తానికి కేసీఆర్ ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి ప్రవేశిస్తారన్నారు. ఢిల్లీలోని ఎస్పీ మార్గ్ లో పెద్ద భవనాన్ని తీసుకున్నాం అన్నారు. రేపు తెలంగాణ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు.
పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు బిఅరెస్ కార్యాలయ ప్రారంభానికి హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే రైతుల కోసం పేదల కోసం అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని కేసీఆర్ భావిస్తున్నారు.
Read Also: Dr Vaishali Case: డాక్టర్ వైశాలి కేసులో పురోగతి.. దొరికిన నవీన్ రెడ్డి కారు
భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతుల కోసం 24 గంటల కరెంటు ఇస్తున్నారు. ఉచిత కరెంటు దేశంలో ఇవ్వాలని భావిస్తున్నారని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కోసం పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ప్రత్యేకంగా నిర్మించిన వేదశాలలో రాజశ్యామల యాగం ప్రారంభం అయింది. ఇవాళ రేపు యాగం, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు కేసీఆర్.
Read Also: Balakrishna: రేపే తారకరామా థియేటర్ ఓపెనింగ్