ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లక్ష్యంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ తన పత్రికలో రాస్తున్న కథనాలు, విశ్లేషణలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని, వాటిపై తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికా విలువల గురించి నీతులు చెప్పే వ్యక్తి, తన రాతలతో సమాజంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఒక పత్రికా అధినేతగా విశ్లేషణ చేసేటప్పుడు రెండు వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని, కానీ…
బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అత్యంత ఘాటుగా స్పందించారు. కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెను ఇబ్బందిగా మారాయని, ఆమె ఎవరో వెనుక ఉండి ఆడిస్తుంటే కీలుబొమ్మగా మారి ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేసీఆర్ గారిని కంటతడి పెట్టిస్తూ, ఆయనను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సునీత స్పష్టం చేశారు.…
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ వద్ద రాజకీయ సెగ రాజుకుంది. గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వారు భారీ ఎత్తున తరలివచ్చి ఫామ్‌హౌస్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, అసెంబ్లీలో ప్రజా గొంతుక వినిపించాల్సిన బాధ్యతను…
తెలంగాణ శాసనసభలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై జరుగుతున్న చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. బహిరంగ సభల్లో మాట్లాడటం కంటే, చట్టసభలో మాట్లాడే మాటలకు ఎంతో విలువ , బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలను ప్రభుత్వం స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నా, వారు సభకు రాకపోవడం దురదృష్టకరమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి రాకపోవడం విచారకరం గత రెండేళ్లుగా ప్రతిపక్ష నేత…
Kavitha vs Harish Rao: తెలంగాణ శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మరోసారి హరీష్‌రావును టార్గెట్ చేసింది. తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేసింది. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్ ఏం చెబుతారు?..
కేసీఆర్ సభకు రాకుండా టీఆర్ఎస్ ను సర్వ నాశనం చేసిన హరీష్ రావుకు పాలమూరు మీద మాట్లాడే అవకాశం సభలో ఇవ్వడం ఏందీ అని కల్వకుంట్ల కవిత ప్రశ్నించింది. అప్పుడు జగన్ మెహన్ రెడ్డి, ఇప్పుడు చంద్రబాబులు తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేశారు.
నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే.. ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞం ప్రారంభించి కృష్ణ నదిపై ప్రాజెక్టులు కట్టాలని ప్లాన్ చేశారన్నారు. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ లాంటి వాళ్లు సొంత పార్టీపైనే ఉద్యమం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పార్లమెంట్లో కూడా పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కోట్లడారన్నారు. తెలంగాణకు…
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీటి వాటాలపై తెలంగాణ…
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కి నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత? అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైందని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు. మంత్రి ఆనం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…