Sunil Gavaskar: “ఆ ఇద్దరి వెంటనే తీసేయండి”.. ఫైనల్ ముందు టీమిండియా మేనేజ్మెంట్‌కు గవాస్కర్ కీలక సూచనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar: టీ20 వరల్డ్ కప్ 2026 కథ క్లైమాక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. మరికొన్ని గంటల్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఓపెనర్ అభిషేక్ శర్మ ఫామ్‌పై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు.. ఈ అంశంపై తాజాగా భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. అభిషేక్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అభిషేక్ శర్మ చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ, ప్రత్యర్థి బౌలర్లు ఎలా బోల్తా కొట్టిస్తున్నారో గమనించడం లేదని విమర్శించారు. బౌలర్లు ఎంతగా ఇబ్బంది పెడతున్నా.. తన శైలిని మాత్రం మార్చుకోవడం లేదన్నారు. ఈ కారణాల దృష్ట్యా అభిషేక్‌ను వెంటనే జట్టు నుంచి తప్పించాలని సూచించారు. అతని స్థానంలో రింకూ సింగ్‌కు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేశారు. సంజూ, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని తన మాస్టర్ ప్లాన్‌ను వివరించారు.
READ MORE: China On Iran War: ఇరాన్‌లో కుట్రల్ని సహించము: అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
రింకూ సింగ్‌కు ఉన్న పోరాట పటిమ ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లలో జట్టుకు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ చాలా మార్పులు అవసరమని సునీల్ గవాస్కర్ సూచించారు. సూపర్-8 దశ నుంచి వరుసగా విఫలమవుతున్న వరుణ్ చక్రవర్తిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెమీఫైనల్‌లో 4 ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తూ అతడి స్థానంలో కుల్దీప్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం బౌండరీలు చాలా పెద్దవని, అక్కడ కుల్దీప్ వంటి మాయాజాలం ఉన్న స్పిన్నర్ వికెట్లు తీయగలడని గవాస్కర్ వివరించారు. ప్రపంచకప్ కల నెరవేరాలంటే ఈ కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజ్మెంట్ వెనకాడకూడదని ఈ 1983 ప్రపంచకప్ విజేత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!