Revanth Reddy : కేసీఆర్, కేజ్రీవాల్, అసదుద్దీన్ ముగ్గురూ సుపారీ కిల్లర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy : టీఆర్ఎస్ నేడు బీఆర్ఎస్ గా ఆవిర్భవించింది. బీఆర్ఎస్ పార్టీపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీలను మార్చే కేసీఆర్ కు కాలం చెల్లిందన్నారు. తనను ప్రజలు నమ్మే రోజులు పోయాయన్నారు. ‘టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదు.. త్వరలో వీఆర్ఎస్ కాబోతోంది’ అంటూ వ్యాఖ్యానించారు. మూడోసారి అధికారం చేపట్టేందుకే రంగులు, పార్టీల పేర్లు మారుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు కేసీఆర్కు పేరుబంధం తెగిపోయిందన్నారు. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడిగా మార్చేందుకు కేసీఆర్ పూనుకున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితకు నిజామాబాద్ లో ఓటర్లు ఎలా బుద్ధి చెప్పారో..రాబోయే ఎన్నికల్లో రాష్ట్రమంతా కేసీఆర్ కు అలానే బుద్ధి చెబుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన చేసిన కాంగ్రెస్ కు రాష్ట్రలో జనం పట్టం కట్టబోతున్నారని చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Alampur Ex Mla Joins in BRS: బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
Also Read
కేసీఆర్, కేజ్రీవాల్, ఆసద్దుద్దీన్ కాంగ్రెస్ ను చంపే సుపారి కిల్లర్స్ గా రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అని రేవంత్ స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం మేమే అని చెబుతున్న బీజేపీ కి అంత సీన్ లేదన్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలిస్తే ప్రత్యామ్నాయం అవుతారా..? అంటూ ప్రశ్నించారు. చెరకు ఫ్యాక్టరీ తెరుస్తానని చెప్పి రైతులను కేసీఆర్ నట్టేట ముంచాడన్నారు. నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చిన మోడీ పసుపు బోర్డే ఇవ్వలేదని విమర్శించారు. 80 వేల మందికి రైతుబీమా ఇచ్చానని కేసీఆర్ చెబుతున్నాడు. 80 వేల మంది మాత్రమే చనిపోయినట్లు ఎన్సీఆర్బీ లెక్కలు చెబుతున్నాయి. కానీ నిజానికి ఎనిమిదేళ్లలో లక్ష యాభై వేల మంది రైతులను కేసీఆర్ పొట్టనబెట్టుకున్నాడరని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!