Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది. నేటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగయనుంది. సాయంత్రం 6గంటలకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను సంప్రదిస్తామన్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టని బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ప్రశ్నించారు. నిన్న కేసీఆర్ సభపెట్టి పచ్చి అబద్ధాలు, అసత్యాలు, వక్రీకరణ తప్ప అందులో ఏమి లేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక అని తెలిపారు.
జేపీ నాయకులు గల్లీ నేతలకంటే దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావ్ మండి పడ్డారు. తెలంగాణ భవన్ లో మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆయన బీజేపీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిచెప్పారు.
మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. నాంపల్లి పార్టీకార్యాలయంలో మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబ్బు దొరికింది ఫార్మ్ హౌస్ నుండి వచ్చిందా ప్రగతి భవన్ నుండి వచ్చిందా? మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీఆర్ఎస్ పెద్ద కుట్ర చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసనతో ఉన్నారని తెలిపారు. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్ టాపిక్. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది.