BRS Central Office: నేడే బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం.. మధ్యాహ్నం ముహూర్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Central Office: ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ముందుగా జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం కేసీఆర్ తన ఛాంబర్ కు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ సెంటర్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనాలని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలందరినీ పార్టీ అధినేత ఆహ్వానించారు కేసీఆర్ ఢిల్లీకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Read also: Congo: కాంగోలో వరద విలయం.. 120 మంది దుర్మరణం
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకోనున్నారు. పార్టీకి సంబంధించిన పలు కార్యక్రమాల నిమిత్తం ఆయన 17వ తేదీ వరకు ఢిల్లీలోనే ఉంటారు. ఇప్పటికే తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో శాసన సభల ప్రతినిధులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత దేశంలోని పలు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ ఫర్ ఇండియా, దేశ్ కా నేత, కిసాన్ కీ భరోసా, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదాలతో హోర్డింగ్ లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Read also: Uttar Pradesh: అంత్యక్రియలకు డబ్బు లేక రోజుల తరబడి తల్లి మృతదేహంతోనే..
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆ తర్వాత భారతీయ రాష్ట్ర సమితి (BRS)గా జాతీయ పార్టీగా అవతరించింది. పార్టీ పేరు మార్పు విషయమై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు ఈసీ లేఖ రాసింది. ఈ సందర్భంగా లేఖపై కేసీఆర్ సంతకం చేశారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, నటుడు, రాజకీయ నాయకుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. గులాబీ జెండా మధ్యలో భారతదేశం చిత్రీకరించబడింది. పార్టీ జెండా రంగు, గుర్తు మారలేదు. 22 ఏళ్ల టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Aatma Bandhuvu: ఆరు పదుల ‘ఆత్మబంధువు’
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!