GVL Narasimha Rao: తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అస్తిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణ చీప్ పబ్లిసిటీ అన్నారు. కట్టుకథలు, కాల్పనిక విషయాలు సృష్టించి రాజకీయ సంచలనం కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ మండిపడ్డారు. ఆయన పూర్తిగా అవాస్తవం, నిరాధారమైన కట్టు కథ అల్లుతున్నారని.. కేసీఆర్ను ఏమైనా వైసీపీ స్పోక్స్ పర్సన్గా నియమించారా అని ప్రశ్నించారు. వైసీపీకి లేని భయాలు కేసీఆర్కు ఎందుకు అని నిలదీశారు.…
అశ్వారావుపేట సమితిగా ఉన్నపుడు నేను అందరిని పోటీ చేయాల్సిందిగా కోరెను ఎవరు రాకపోవడంతో నేనే పోటీలోకి వచ్చానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రి జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి నియోజకవర్గం లేని అభివృద్ధి మన అశ్వారావుపేట నియోజకవర్గ నికి అభివృద్ధి చేసానని అన్నారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. మోడీ జీ అంటూ ట్విట్టర్ వేదికగా మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారు.. మరి ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయి మోడీ జీ? అంటూ ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ లో దొంగలే దొంగ అన్నట్టు ఉన్నదని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ ఎద్దేవ చేశారు. గవర్నర్ కి అనుమానం ఉంటే హోంశాఖ కి ఫిర్యాదు చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుంది నిజమని ఆరోపించారు.
కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ.
మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు.
హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు.
నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు.