కేసీఆర్ అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి. ఇది సబబు కాదన్నారు. రాజకీయ, అభివృద్ధికి మధ్య వ్యత్యాసాలను కేసీఆర్ గుర్తించడంలేదని అన్నారు. రేపు రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. బేగం పెట్ Air port లో కార్యకర్తల నుద్దేశించి ప్రసంగించనున్నారు మోడీ.
మునుగోడు ఎన్నికల లెక్కింపు ఫలితాల వెల్లడిలో గందరగోళంపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు బీజేపీ రాజ్య సభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో అధికారి ఒక్కో విధంగా చెబుతూ ఫలితాలపై కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని అన్నారు.
వేరే పార్టీ ర్తు మీద గెలిచినా వాళ్లకు మంత్రి పదవి ఎలా కట్టబెట్టారు? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరెలా 8 ఏళ్లలో ప్రతిపక్షాలను పడగొట్టి చెడగొట్టరో మేము కూడా దేశంలో ఉన్న అన్ని కోర్టులకు, మేధావులకు డేటా పంపిస్తామన్నారు.
హుజూరాబాద్ లో ఏం జరిగిందో మునుగోడు లో అదే రిపీట్ అయ్యిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. నీవూ హుజూరాబాద్ ఓటర్స్ కు పంచిన డబ్బుపై ఓటుకు నోటు కేసు పెట్టోద్దా? అని ప్రశ్నించారు. 2018 లో ఇచ్చిన అనేక హామీలు ఎందుకు అమలు చేయలేదు? అని మండిపడ్డారు.
నిన్న సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. ఢిల్లీ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మునుగొడులో బీజేపీ గెలుపుకోసం అందరూ కృషి చేశారని అన్నారు.
Bandi Sanjay Resign: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్టోబర్ 31వ తేదీనే రాసినట్లుగా ఉన్న ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోన్న మునుగోడు ఉప ఎన్నికలో కీలక ఘట్టానికి తెరపడనుంది. నేటితో మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ముగయనుంది. సాయంత్రం 6గంటలకు ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికల ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్.
బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను సంప్రదిస్తామన్నారు.