జూ. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్‌పై తమకున్న ప్రేమను, అభిమానాన్ని ఈ సందర్భంగా పంచుకుంటున్నారు.
జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా కార్యరూపం దాల్చుకోనున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తారక్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే, తారక్‌ని ప్రశాంత్ నీల్ సరికొత్త గెటప్‌లో ప్రెజెంట్ చేశాడు. కోర మీసంతో రౌద్రం లుక్‌లో తారక్ అదరహో అనిపించాడు. ఈ పోస్టర్లో తారక్ ముఖాన్ని సగమే చూపించారు. అందులోనే తారక్ పలికిన రౌద్రం, చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్ని బట్టి…
జూ. ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రతి చిన్న సందర్భాన్ని కూడా వీళ్ళిద్దరూ ఎంతో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ విషయాన్ని స్వయంగా వాళ్ళిద్దరే ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పారు. పుట్టినరోజుల్ని అయితే చాలా స్పెషల్‌గా జరుపుకుంటామని, కారులో షికారుకి వెళ్తామంటూ తారక్ పలు సందర్భాల్లో వెల్లడించాడు కూడా! ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తమని మరింత దగ్గర చేసిందని ఇద్దరూ తెలిపారు. ఇప్పుడు రామ్ చరణ్ చేసిన…
వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ సినిమా.. ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లోనూ రికార్డుల పర్వం కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ జీ5 ఈ చిత్రాన్ని 20వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో స్ట్రీమ్ చేయనుంది. తొలుత జీ5 సంస్థ పే-పర్-వ్యూ మోడ్‌లో ఈ సినిమాని తీసుకొస్తామని తెలిపింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని, జీ5 ఆ విధానాన్ని అమలుపరచాలనుకుంది. కానీ, ఆడియన్స్ నుంచి భారీఎత్తున తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. పే-పర్-వ్యూ…
జూ. ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘జై లవ కుశ’లో తాను చెప్పిన ‘ఘట్టమేదైనా, పాత్రేదైనా’ అన్నట్టు.. ఎలాంటి పాత్ర ఇచ్చినా అవలీలగా చేసేస్తాడు. ఇతని నటనలో సహజత్వం ఉట్టిపడుతుందే తప్ప.. ఎక్కడా ఫేక్ కనిపించదు. ఈతరం హీరోల్లో నవరసాల్ని పండింగల హీరో ఎవరైనా ఉన్నారంటే, అది తారక్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సాక్షాత్తూ.. దర్శకధీరుడు రాజమౌళి లాంటోడే తన ఫేవరేట్ హీరో అని తారక్ చెప్పాడంటే, అతడు ఎంత విలక్షణ…
జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో NTR30 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! నిజానికి, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకి వెళ్ళాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ముఖ్యంగా.. స్క్రిప్టుని ఫైనల్ చేయడంలోనే ఎక్కువ జాప్యం అవుతోంది. తొలుత ప్రాంతీయ చిత్రంగానే దీన్ని తెరకెక్కించాలని అనుకున్నారు. అయితే.. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో, అందుకు అనుగుణంగా కథలో మార్పులు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు దాదాపు ఆ పనులు…
జూ. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఉందన్న విషయం అందరికీ తెలుసు! ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తుందో కూడా క్లారిటీ లేదు. అయితే.. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా పనుల్ని మాత్రం తారక్ అప్పుడే మొదలుపెట్టేశాడని సమాచారం. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం.. తారక్ పాత్రకి సంబంధించిన లుక్ టెస్ట్‌ని ప్రశాంత్ నీల్ రీసెంట్‌గానే నిర్వహించాడట! తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఫ్యాన్స్‌కి స్పెషల్…
‘ఆర్ఆర్ఆర్’ హీరోయిన్ ఈ నెల 14న ఓ ఇంటిది కాబోతోంది. బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ తో ఆలియాభట్ వివాహం ఓ ప్రైవేట్ వేడుకలా జరగనుంది. అయితే ఆ తర్వాత నాలుగు రోజులకు ముంబైలోని తాజ్ హోటల్స్ లో బాలీవుడ్ ప్రముఖులతో పాటు ముఖ్యమైన అతిథులకు భారీ స్థాయిలో పార్టీ ఇవ్వబోతోందీ జంట. ఈ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి ఫ్యామిలీలతో హాజరుకాబోతున్నట్లు సమాచారం. దీనికోసం సొంతంగా ఓ ఛార్టర్డ్ ఫ్లైట్…
(ఏప్రిల్ 11తో జూ.యన్టీఆర్ కెరీర్ కు 25 ఏళ్ళు) నందమూరి నటవంశంలో మూడోతరం స్టార్ హీరోగా జేజేలు అందుకుంటున్నారు యంగ్ టైగర్ యన్.టి.ఆర్. రాజమౌళి తాజా చిత్రం `ఆర్.ఆర్.ఆర్.`లో నటనాపరంగా అధిక మార్కులు పోగేసుకున్నది యన్టీఆర్ అని జనం ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. కొమురం భీమ్ పాత్రలో జీవించిన యంగ్ టైగర్ ఈ యేడాది ఏప్రిల్ 11తో నటునిగా పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆ మాటకొస్తే మరింత పసివయసులోనే తాత నటరత్న యన్టీఆర్ తెరకెక్కించిన హిందీ `బ్రహ్మర్షి విశ్వామిత్ర`లో…
(మార్చి 28తో యన్టీఆర్ ఆదికి 20 ఏళ్ళు)యంగ్ టైగర్ యన్టీఆర్ ను పవర్ ఫుల్ మాస్ హీరోగా జనం ముందు నిలిపిన చిత్రం ఆది. యన్టీఆర్ కెరీర్ ను మలచిన రెండు చిత్రాలు స్టూడెంట్ నంబర్ వన్, ఆది అనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల ద్వారా రాజమౌళి, వి.వి.వినాయక్ దర్శకులుగా పరిచయం కావడమూ విశేషమే! తరువాతి రోజుల్లోనూ ఈ ఇద్దరు దర్శకులు యంగ్ టైగర్ తో సక్సెస్ ఫుల్ జర్నీ సాగించారు. తెలుగు సినిమా రంగంలో…