జూ. ఎన్టీఆర్ ఒక గొప్ప నటుడే కాదు.. మంచి మనసున్న మారాజు. ఎంత ఎదిగినా, ఒదిగి ఉండే గుణం అతనిది. తానొక స్టార్ హీరోనన్న ఇగో ఏమాత్రం ఉండదు. తన తోటి నటీనటులతో ఎంతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తాడు. ఎవరిని అడిగినా సరే.. తారక్ వ్యక్తిత్వాన్ని ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ నటుడు విద్యుత్ సమ్వాల్ సైతం అదే పని చేశాడు. తన ఖుదా హాఫిజ్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అదిగో ఆ సినిమాతో, ఇదిగో ఈ చిత్రంతో అంటూ.. త్వరలో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందని చాలా పుకార్లొచ్చాయి. కానీ, అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈమె టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టు జోరుగా ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం…
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తోన్న తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్…
నజ్రియా నజీమ్.. రాజా రాణి డబ్బింగ్ సినిమాతోనే తెలుగులో విపరీతమైన క్రేజ్ సాధించింది. ఆ సమయంలోనే ఈమె తెలుగులో అడుగుపెట్టొచ్చని అంతా అనుకున్నారు కానీ, అలా జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ‘అంటే సుందరానికీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈనెల 10వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నజ్రియా సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో పాటు తన మనసులోని మాటల్ని పంచుకుంది. ముఖ్యంగా.. తాను ఏయే తెలుగు హీరోలతో కలిసి…
ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలుసు! దేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఇది నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా దంగల్, బాహుబలి: ద కన్‌క్లూజన్, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వరల్డ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ ‘జీ5’లో 1000 మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో భారీ రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హిస్టారికల్…
మహానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు జయంతి నేడు.. అయితే.. ఈ నేపథ్యంలో తాతాను తలుచుకుంటూ.. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సదా మిమ్మల్ని స్మరించుకుంటూ అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేశారు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనుసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..’ సదా మీ ప్రేమకు బానిసను అంటూ.. ట్విట్టర్లో పోస్ట్ చేశారు జూ.ఎన్టీఆర్. ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్…
ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాటికి వెళ్లి నివాళ్లు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక మహానటుడుగా ప్రపంచనికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఎన్టీఆర్ అవతార పురుషుడు. చరిత్రలోనే రాముడు, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన…
కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కమిటైనప్పుడే.. ఇందులో కథానాయికగా నటించేందుకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విషయాన్ని పలుసార్లు ఆలియా కన్ఫమ్ చేసింది కూడా! అయితే.. అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడం, రణ్‌బీర్‌తో పెళ్ళి కూడా అయిపోవడంతో.. ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటినుంచి NTR30లో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఆలియా తప్పుకున్నాక మేకర్స్ చాలామంది…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #NTR31 అఫీషియల్ అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతను తన 31వ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్‌తో జత కడుతున్నాడని తేలింది. ఇదే సమయంలో తారక్ ఇంటెన్స్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. దీంతో, సర్వత్రా ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది కూడా! ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా…