టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రౌడీ బాయ్స్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. దిల్‌రాజు ప్రొడక్షన్.. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ట్రైలర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మేకర్స్ రిలీజ్ చేయించారు. ట్రైలర్ చూస్తుంటే…
జూనియర్ ఎన్టీఆర్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన అంటే పడిచచ్చే డైహార్డ్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’తో పాన్ ఇండియా రేంజ్ లో ఫాలోవర్స్ ను సంపాదించుకునే పనిలో ఉన్నారు తారక్. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో బాలీవుడ్ తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ ఎన్టీఆర్ కు అభిమానులు ఉన్నట్టు వెల్లడైంది. ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్లలో భాగంగా పలు బిటౌన్ పాపులర్ షోలలో పాల్గొన్న విషయం…
సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూ.ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ముంబైలో ఫుల్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు హీరోలు. ఇప్పటికే ముంబైలో ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ త్రయమే కనిపిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్న స్టార్ హీరోలు తాజాగా కపిల్ శర్మ షో లో సందడి…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం టీమ్ అంతా సినిమా ప్రమోషన్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ముంబైలో జరిగిన ఈ సినిమా ఈవెంట్లో సల్మాన్ ఖాన్ కూడా పాల్గొన్నారు. ఆదివారం…
ఎపిక్ బ్లాక్ బస్టర్ బాహుబలి డ్యూయాలజీ తర్వాత తనరాజమౌళి నుంచి వస్తున్న తదుపరి భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఆర్ఆర్ఆర్”. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ ని పెంచాయి. ఇక రాజమౌళి మార్క్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్అవుట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాకు సంబంధించి ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో…
“ఆర్ఆర్ఆర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబై ఫిల్మ్ సిటీ సమీపంలోని గురుకుల్ మైదానంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ జరగకపోయినా ఆసక్తికరమైన అప్డేట్లు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపిస్తూ గొప్పగా మాట్లాడారు. Read Also : సల్మాన్ మాట్లాడుతూ “నాకు జూనియర్ ఎన్టీఆర్ నటన అంటే చాలా ఇష్టం.…
నిన్న రాత్రి ముంబైలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో బిగ్ అనౌన్స్మెంట్ కు వేదికైంది. ఈ వేడుకకు అతిథిగా హాజరైన సల్మాన్ ఖాన్ అభిమానులకు ఇది శుభవార్త. డిసెంబర్ 19న సూపర్ స్టార్ తన హిట్ చిత్రం ‘భజరంగీ భాయిజాన్’ రెండో భాగాన్ని ‘ఆర్ఆర్ఆర్’ వేదికపై అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం సల్మాన్ కెరీర్లో అత్యుత్తమ చిత్రాలలో ఒకటి. రాజమౌళి, ఎన్టీఆర్, అలియా భట్, రామ్ చరణ్, కరణ్ జోహార్ సమక్షంలో ముంబైలో జరిగిన…
ప్రతిఒక్కరికి ఒక వస్తువంటే పిచ్చి ఉంటుంది.. కొందరికి కార్లు పిచ్చి .. ఇంకొందరికి ఫోటోగ్రాఫ్ ల పిచ్చి.. మరికొందరికి పురాతన వస్తువులను సేకరించడం పిచ్చి.. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వాచ్ లంటే పిచ్చి.. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బ్రాండ్ల విషయంలో ఎన్టీఆర్ తగ్గేదేలే అన్న విషయం అందరికి తెలియసిందే .. మొన్నటికి మొన్న ఇండియాలోనే మొదటి లాంబోగినీ కారు కొని వార్తల్లో నిలిచినా తారక్ తాజాగా.. కోట్ల రూపాయలు విలువ…
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. గత రెండు రోజుల నుంచి అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. కొన్ని ఫన్నీ మూమెంట్స్, మరికొన్ని సినిమా విశేషాలతో ప్రెస్…
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో దూకుడుగా పాల్గొంటోంది. ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్లలో మరింత వేగం పెంచిన మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో చరణ్, తారక్, రాజమౌళితో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఈరోజు అలియా తన షూటింగ్‌ను వాయిదా వేసుకుని హైదరాబాద్‌లో “ఆర్ఆర్ఆర్” విలేకరుల సమావేశానికి హాజరు కావడానికి కొంత సమయం కేటాయించింది. తెలుగు మీడియాతో తన ఇంటరాక్షన్ సమయంలో…