ఆర్ఆర్ఆర్ సినిమా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో అందరికీ తెలుసు! దేశంలో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ఇది నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో వరుసగా దంగల్, బాహుబలి: ద కన్‌క్లూజన్, కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాలున్నాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ వరల్డ్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఆల్రెడీ ‘జీ5’లో 1000 మిలియన్‌కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌తో భారీ రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో హిస్టారికల్ రికార్డ్ నమోదు చేసింది.
నెట్‌ఫ్లిక్స్ రిపోర్ట్ ప్రకారం.. ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్‌కు మే 23 నుంచి 29 మధ్యలో ఏకంగా ఒక కోటి 83 లక్షల 60 వేల గంటల వ్యూవర్షిప్ వచ్చింది. అంత తక్కువ సమయంలో ఇంత భారీ వ్యూవర్షిప్ రావడం నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో ఇదే మొదటి. దీంతో.. ఇది నాన్-ఇంగ్లీష్ సినిమాల జాబితాలో ఆల్‌టైమ్ నం.1 సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఓటీటీలో వస్తోన్న విశేష ఆదరణ బట్టి చూస్తుంటే, ఇంకా ఈ సినిమా హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో ఇది ఓటీటీలో మరిన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
కాగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగణ్, శ్రియా శరణ్‌లు కీలక పాత్రలు పోషించారు. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ వసూళ్ళు కొల్లగొట్టి, అన్ని ఏరియాల్లోనూ భారీ లాభాలు రాబట్టింది.
RRR is officially the #1 most watched non-English film on Netflix! pic.twitter.com/XbeXzb9KGQ
— Golden (@netflixgolden) May 31, 2022