Jr NTR: ఆ తమిళ దర్శకుడితో క్రేజీ సినిమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ రావడంతో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇకపై పాన్ ఇండియా సినిమాలే చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో, క్రేజీ దర్శకులతోనే జోడీ కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తోన్న తారక్, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో NTR31 ప్రాజెక్ట్ చేయనున్నాడు. ఆల్రెడీ తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది కూడా! కుదిరితే, ఈ ఏడాది చివరి నుంచే NTR31ను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇలా రెండు సినిమాలు చేతిలో ఉండగానే, తారక్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తాజాగా ఓ వార్త తెరమీదకొచ్చింది. ఇంతకి దర్శకుడెవరో తెలుసా? వేట్రిమారన్. ఆడుకాలమ్, విసారనై, వడా చెన్నై, అసురన్ చిత్రాలతో ఈయన ప్రత్యేక గుర్తింపు గడించాడు. అసురన్ చిత్రమైతే జాతీయ పురస్కారాన్నే అందుకుంది. దీంతో, ఈ దర్శకుడు కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే తారక్ ఓ పాన్ ఇండియా సినిమాకి ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. రీసెంట్‌గానే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు నడిచాయని, స్టోరీ నచ్చడంతో తారక్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చాడని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట!
Also Read
వేట్రిమారన్ తీసే సినిమాలన్నీ హార్డ్ హిట్టింగ్‌గా ఉంటాయి. నటుల్ని, ముఖ్యంగా కథానాయకుల్ని చాలా కొత్తగా, డిఫరెంట్‌గా చూపిస్తాడు. గతంలో ఏ దర్శకుడు ప్రయత్నించని రీతిలో, హీరోల్ని ప్రెజెంట్ చేస్తాడు. ఇక్కడ తారక్ ఏమో నవసరాలు పండించడంలో దిట్ట! అలాంటిది, తారక్‌తో కావాల్సినంత నటనని పిండుకోవచ్చు. అందుకే, ఈ కాంబో మీద అప్పుడే విపరీతమైన బజ్ వచ్చిపడింది. మరి, ఈ వార్త నిజమో కాదో తేలాలంటే, కొన్నాళ్లు వేచి చూడాల్సిందే!
- Tags
- Asuran
- Jr NTR
- Koratala Siva
- NTR30
- NTR31
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!