RRR: నెట్టింట్లో తాండవం చేస్తోన్న తారక్ సీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Tuck Scene in RRR Creating Sensation In Internet: దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రిలీజై నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటికీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గట్లేదు. థియేట్రికల్ రన్‌లో బాక్సాఫీస్ పరంగా ఎన్నో రికార్డులు నమోదు చేసిన ఈ చిత్రం.. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి అక్కడా రికార్డుల పర్వాన్ని కొనసాగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో మూడు వారాలపాటు నాన్-హిందీ కేటగిరీలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకొని, ఈ ఫీట్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా చరిత్రపుటలకెక్కింది. అంతేకాదు, ఎందరో హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని సైతం ఈ చిత్రం ఫిదా చేసింది. ఈ సినిమాని చూసిన చాలామంది విదేశీయులు, తమ ఎగ్జైట్‌మెంట్‌ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఓ హాలీవుడ్ సెలెబ్రిటీ అయితే, ఇలాంటి యాక్షన్ భరిత చిత్రాన్ని ఎన్నడూ చూడలేదంటూ ఆర్ఆర్ఆర్‌ని తారాస్థాయిలో కొనియాడాడు.
ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమాలో ఇంటర్వెల్‌కి ముందు ఓ ట్రక్కులో పులులు, జింకలు, ఎలుగుబంట్లు, నక్కలతో జూ. ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సన్నివేశం నెట్టింట్లో తాండవం చేస్తోంది. ఓ వెస్టర్న్ యూజర్ ఈ సీన్‌ని ట్విటర్‌లో షేర్ చేయగా.. అది అక్షరాల 12 మిలియన్ వ్యూస్ రాబట్టింది. అది కూడా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే! ఏ భారతీయ సినిమా వీడియో కూడా, ఈ స్థాయిలో ప్రభంజనం సృష్టించిన దాఖలాలు లేవు. అతను ఆ వీడియోని షేర్ చేస్తూ.. ‘‘నేను ఇప్పటివరకూ 29 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాల్ని చూశాను. కానీ, ఆర్ఆర్ఆర్‌లో ఉన్న ట్రక్ లాంటి అద్భుతమైన షాట్‌ని ఎప్పుడు చూడలేదు’’ అంటూ పేర్కొన్నాడు. ఈ ట్వీట్ పుణ్యమా అని.. ఆర్ఆర్ఆర్ సినిమా చర్చలు మరోసారి నెట్టింట్లో మొదలయ్యాయి. జూ. ఎన్టీఆర్ పేరు కూడా గ్లోబల్‌గా ట్రెండ్ అవుతోంది. ఇది తారక్ ఫ్యాన్స్‌కే కాదు.. తెలుగు ప్రేక్షకులకూ గర్వించదగ్గ విషయమే!
Also Read
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
- Anirudh Ravichander: రామ్ చరణ్ - సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
- Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
I’ve watched 29 MCU movies.
I’ve never seen a shot as ridiculous and incredible as this truck/animal shot in RRR (on Netflix) pic.twitter.com/JTheyZIYB7
— Nate Offord (@NateOfford) July 17, 2022
తాజావార్తలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..