ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ట్యాంక్ బండ్ వద్దగల ఎన్టీఆర్ ఘాటికి వెళ్లి నివాళ్లు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈమేరకు ఈ రోజు ఉదయం జూనియ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, లక్ష్మీపార్వతి తదితరులు సందర్శించి, నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఒక మహానటుడుగా ప్రపంచనికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి. ఎన్టీఆర్ అవతార పురుషుడు. చరిత్రలోనే రాముడు, కృష్ణుడిని భూమి మీదకు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఆనాడు రాముడు, కృష్ణుడిని కూడా దేవుళ్ళుగా గుర్తించలేదు వారు చనిపోయిన తరువాతే దేవుళ్ళు అయ్యారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కీర్తి ఎప్పటికీ నిలిచి వుంటుంది. ఎన్టీఆర్ అవార్డును 25 సంవత్సరాల నుంచీ ఇస్తున్నాను. ఎన్టీఆర్ అందరికీ ఇష్టమైన వ్యక్తి కానీ కొందరికి కంటగింపు అవుతుండటం దురదృష్టం అని లక్ష్మి పార్వతి తెలిపారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈమేరకు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ, శత జయంతి ఉత్సవాలను మే 28 నుంచి ఏడాదిపాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో తమ కుటుంబం నుంచి నెలకు ఒకరుచొప్పున పలు కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.