బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అదిగో ఆ సినిమాతో, ఇదిగో ఈ చిత్రంతో అంటూ.. త్వరలో జాన్వీ కపూర్ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతోందని చాలా పుకార్లొచ్చాయి. కానీ, అవేవీ వాస్తవం కాదని తేలిపోయింది. అయితే, ఇప్పుడు మాత్రం ఈమె టాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టు జోరుగా ఓ పుకారు చక్కర్లు కొడుతోంది.
జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే! తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ విషయమై అధికార ప్రకటన వచ్చింది కూడా! అలాగే తారక్ ఫస్ట్‌లుక్‌ని సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసమే కథానాయిక పాత్రకు జాన్వీ కపూర్‌ను ఫైనల్ చేసినట్టు సినీ వర్గాల్లో ఓ వార్త వినిపిస్తోంది. తొలుత ఈ ప్రాజెక్ట్ కోసం దీపికా పదుకొణెను సంప్రదించారట! అయితే, ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండడంతో జాన్వీని సంప్రదించినట్టు తెలిసింది. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, జాన్వీ మరో ఆలోచన చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.
నిజానికి.. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ చేస్తోన్న NTR30 సినిమాలోనే జాన్వీ కపూర్‌ను తీసుకోవాలని ప్రయత్నించారు. కానీ, ఎందుకో కుదరలేదు. ఇప్పుడేమో NTR31కి ఆమె పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. మరి, ఈ వార్తైనా నిజమా? కాదా? అనేది తేలాల్సి ఉంది. కాగా.. NTR31 ప్రాజెక్ట్ నవంబర్ 2వ తేదీ నుంచి సెట్స్ మీదకి వెళ్లనుందని టాక్. ఆలోపు కొరటాల శివ సినిమాను తారక్ ముగించనున్నట్టు తెలుస్తోంది.