కొడాలి నానిని తిట్టాలని నాకు ఏమీ లేదు అన్నారు పవన్ కల్యాణ్.. నాకు వ్యక్తిగతంగా కొడాలి నానితో ఏ శత్రుత్వం లేదన్నారు.. అయితే, వంగవీటి రాధా వివాహంలో కొడాలి నాని కనపడితే కలిశాను అని గుర్తుచేసుకున్నారు.. కానీ, కొడాలి నాని నోరు పారేసుకునే ఎమ్మెల్యే అని విమర్శించారు.. నాని నోరు కట్టడి చేయాలి అంటే రాముని గెలిపించాలని గుడివాడ ప్రజలకు పిలుపునిచ్చారు.
నెల్లూరులో ఎంతటి ఉద్వేగాన్ని చూడలేదని.. ఇంత ప్రేమ అభిమానాలను చూపిస్తారని కలలో కూడా అనుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నారని.. నెల్లూరులో గల్లీ.. గల్లీ తిరిగిన వ్యక్తని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా సింహ పురిలో ఏర్పాటు చేసిన సింహగర్జన సభలో ఆయన మాట్లాడారు. “నాకు తిరుపతిలో గల్లి గల్లి తెలుసు పవన్ కళ్యాణ్ కు నెల్లూరులో అంతా తెలుసు. సింహపురిలో చరిత్ర తిరగ రాయబడుతుంది. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే ఎవరైనా ఉంటారా. అడ్డం వస్తే తొక్కుకుంటూ పోతాం. ప్రజలకు బంగారు భవిష్యత్…
రాష్ట్ర భవిష్యత్కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
తన కూతురు వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ముద్రగడ.. నా కూతురుకు పెళ్లి అయ్యింది.. తాను పెళ్లి కాకముందు వరకే నా ప్రాపర్టీ.. ఇప్పుడు ఆమె మెట్టినిల్లె ఆమె ప్రాపర్టీగా పేర్కొన్నారు. నన్ను నా కూతురుతో కొంతమందితో తిట్టించారని మండిపడ్డారు.. ఇది బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, రాజకీయం రాజకీయమే, కూతురు కూతురే అని చెప్పుకొచ్చారు. నేను ఒకసారి వైఎస్ఆర్సీపీలో చేరాను.. ఇక పక్క చూపులు చూడను. ఎవరెన్ని అనుకున్న సీఎం వైఎస్…
వైసీపీ అగ్రనాయకత్వంపై పవన్ కల్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కల్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై, అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.