సీఎం సొంత జిల్లాలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని.. ఎపీ నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ మొదలవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. కడప జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. “ఎపీ ప్రగతిలో మోడీ పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పీవీ నరసింహ రావు కి సైతం భారత రత్న ఇచ్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక మోడీ ప్రభుత్వం లక్ష్యం. పదేళ్ల తర్వాత చిన్న పిల్లలకి కూడా గుర్తు లేకుండా పోయే పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ని దేశంలో లేకుండా చేయాల్సిన బాధ్యత మీదే. మన దేశంలో మోడీ విశ్వ గురుగా అవతరించి దేశాన్ని పాలిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. అత్యధిక పార్లమెంట్ సీట్లను ఎన్డీయే కూటమి సాధిస్తుంది అన్న విశ్వాసం ఉంది. ప్రపంచం స్వాగతిస్తున్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం.2014 ఎన్డీయే లేక ముందు భారత్ 11 వ స్థానంలో ఉండేది. నేడు ప్రపంచంలో మూడో స్థానానికి చేరడంతో మోడీ కృషి ఎనలేనిది
READ MORE: Pawan Kalyan: నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే.. గుంటూరు సభలో పవన్ ఫైర్
కేంద్ర ప్రభుత్వం 25 లక్షల ఇల్లు మంజూరు చేస్తే కేవలం ఇళ్ల స్థలాలు ఇచ్చి చేతులు దులుపుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ” కరోనా తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు కేజీల బియ్యం అందిస్తుంది. పేదల వైద్యం కోసం 75 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ ఉచిత వైద్యం. కాంగ్రెస్ హయాంలో ప్రతి ఒక్క మంత్రిపై అవినీతి ఆరోపణలు గడిచిన పడేళ్లలో బీజేపీ మంత్రుల్లో ఏ ఒక్కరిపై ఆరోపణలు లేవు అదే మా నినాదం. ఒకే దేశం ఒకే జెండా అనేది మా నినాదం. జమ్మూకాశ్మీర్ సాధించడం మా ప్రభుత్వం తో నే సాధ్యంఅయోధ్య రామ మందిరం హిందువుల ఐదు వందలెల్ల కల. రామ రాజ్యాన్నీ సాధించిన వ్యక్తి మోడీ. కుల మతాల అతీతమైన పార్టీ బీజేపీ. త్రిబుల్ తలాక్ తీసేయడం ముస్లిం మైనారిటీ నారీ మణులకు గొప్ప వరం. 58 వేల కోట్లతో దేశంలో నేషనల్ హై వే రోడ్లు వేశాం. అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండని కోరారు.”