Pawan Kalyan: నేను బ్రతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నేల మీద పిచ్చి ప్రేమ ఉన్నవాడినని.. ప్రజలను కాపాడుకోవాలని అనుకునేవాడినని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సాగునీటి కాలువలలో పూడికబెట్టిన ప్రభుత్వం ఇదని.. పూడిక తీయలేని ఇరిగేషన్ శాఖ ఈ రాష్ట్రంలో ఉందని విమర్శించారు. రేపల్లె లో ఆయన మాట్లాడుతూ.. “పక్క రాష్ట్రాల్లో పంటల దిగుబడి పెరుగుతుంటే, ఈ రాష్ట్రంలో మాత్రం దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల 3వేల మంది కౌలు రైతులు చనిపోయారు. చనిపోయిన రైతుల కుటుంబానికి, ఒక్కొక్కరికి లక్ష రూపాయలు నష్ట పరిహారం ఇచ్చిన పార్టీ జనసేన. రైతులకి లాభం చేకూర్చే ప్రభుత్వాలు కావాలి. నేను బ్రతికుండగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను. భారత దేశ సమగ్రతకు భంగం వాటిల్లనివ్వను. అన్నం పెట్టే రైతుకు, అండగా లేని ప్రభుత్వాలు ఎందుకు. ప్రతి నియోజకవర్గంలోనూ త్రాగునీటి సమస్య ఉంది. కేంద్రం అందిస్తున్న జల్జీవన్ ప్రాజెక్టులు, ఈ ప్రభుత్వం ప్రజలకు అందించడం లేదు. సాగు తాగునీరు ఇవ్వలేని ప్రభుత్వం ఎందుకు? సముద్ర తీరంలో ఉన్న, రేపల్లె ను పర్యాటక కేంద్రంగా తయారు చేయవచ్చు. కానీ ఈ ప్రభుత్వం పేకాటలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు.”
READ MORE: Sajjala Ramakrishna Reddy: ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జలతో చర్చించిన జేఏసీ నేతలు
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
పేకాట క్లబ్బుల మీద ఉన్న, జోరు హుషారు ప్రజా సమస్యల తీర్చడం మీద లేదని పవన అన్నారు. ఆయన మాట్లాడుతూ… “సమాజంలో బలమైన వ్యక్తుల కోసం చట్టాలు బలహీనంగా పనిచేస్తాయి. బలహీనంగా ఉన్న వాళ్ల మీద బలమైన చట్టాలు ఉపయోగిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా కాదా, ప్రజాస్వామ్యం గొంతు ఎత్తకపోతే బంగారు భవిష్యత్తు ఉండదు. తీర ప్రాంతానికి కోటలు లాంటి మడ అడవుల్ని కూడా కొట్టేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు నాలాంటి వాడు బ్రతికే ఉంటాడు. అడ్డగోడుగా మీరు దాడులు చేస్తే, తిరగబడటానికి ఒకడుంటాడు. ఉమ్మడి కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చడానికి నేను బాధ్యత తీసుకుంటాను. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాల్వలో పూడికలు తీపిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ అత్యంత ప్రమాదకరం.. మీ భూమిలో మీరు లోన్ తీసుకోవాలన్న సాధ్యపడదు. ఒరిజినల్ డాక్యుమెంటో లేకుండా బ్యాంకులు లోన్లు ఇవ్వవు. మీ ఇంటి బిడ్డకు పెళ్ళి చేయాలంటే, పసుపు కుంకాలు కింద డాక్యుమెంట్ లు ఇవ్వలేరు. ఇప్పటిదాకా ఏ హక్కులు లేకుండానే మన ఇళ్ల మీద పడి ఆస్తులు లాక్కుంటున్నారు. ఎన్ని ఓట్లు, ఎన్ని సీట్లు మెజారిటీ అనేది చెప్పను కానీ, కూటమి ప్రభుత్వం మాత్రం వచ్చి తీరుతుంది. చిరంజీవి లాంటి వ్యక్తిని ,చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టారు.”
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!