ఏలూరు జిల్లా కైకలూరు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో లోడిద లంక, పలాటపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కాపు ఉద్యమనేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్‌కు బహిరంగ సవాల్ విసిరారు.. పవన్ ను పిఠాపురంలో నేను ఓడించకపోతే.. నా పేరు మార్చుకుంటా.. పవన్‌ను ఓడించలేకపోతేనే నా పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు..
సొంత ఇంటికి దారి వేయించుకోలేని వ్యక్తి ఉంగుటూరు వైసీపీ ఎమ్మెల్యే వాసు బాబు అని పవన్ కల్యాణ్ తీవ్రంగా విమర్శించారు. పేకాట నడపడం ద్వారా ఆస్తులు పోగేసుకుంటున్నారని ఆరోపించారు. పేకాటలో క్లబ్బులు నడిపే వాళ్ళు కావాలా.. డీఎస్సీ ఇచ్చే వాళ్ళు కావాలా అంటూ ప్రశ్నించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో గణపవరంలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
జగన్ ను తొలగించు కోవాలనే విషయంపై ఎప్పటి నుంచో చంద్రబాబు కుట్ర పన్నారని నెల్లూర లోక్ సభ వైసీపీ అభ్యర్థి విజయ సాయి రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన గాజు గ్లాస్ సింబల్ వివాదం క్రమంగా పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల కీలక ఘట్టం నేటితో ముగిసింది. సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు కూడా ముగిసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కూటమికి గాజు గ్లాసు గండం వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు సీట్లను పంచుకున్నాయి. 21 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన చోట్ల, టీడీపీ, బీజేపీలకు జనసేన మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు కాగా.. ఫ్రీ…
జనసేన పార్టీకి కామన్ సింబల్‌గా గ్లాసు గుర్తునే కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకూ కామన్ సింబల్ కేటాయింపుపై ఆదేశాలు పంపారు రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంకే మీనా.
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. పిఠాపురం నుంచి పోటీ చేస్తు్న్న జనసేనాని పవన్ కల్యాణ్ నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పవన కల్యాణ్ నేడు తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న సభల్లో పాల్గొంటారు. అయితే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటన ఉంటుందని విజయవంతం చేయాలని నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ…