రాయలసీమలో మూడు సీట్లు వచ్చినందుకు ఎగతాళి చేశారని.. పులివెందులలో కూడా ఇపుడు వైసీపీ కి జగన్ కు ఎదురుగాలి వేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కల్లూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో భూహక్కు పత్రాన్ని తగల బెట్టారు.
ఇవాళ ఒక్కరోజే నియోజకవర్గంలోని సుమారు 20 గ్రామాల నుంచి 500కు పైగా కుటుంబాలు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారిలో పెదకూరపాడు, హుస్సేన్ నగర్, బెల్లంకొండ, వెంకటాయపాలెం, అమరావతి, మునగోడు, అచ్చంపేట, వేల్పూరు, కస్తల మండలాలకు చెందిన 20 కుటుంబాలు టీడీపీని వదిలి పెట్టి వైసీపీలో చేరారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో ప్రచారంలో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్‌పై కూల్ డ్రింక్ బాటిల్ విసిరారు గుర్తు తెలియని వ్యక్తులు.. అయితే, సాయి ధరమ్ తేజ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.. కానీ, పక్కనే ఉన్న జనసేన నాయకుడు నల్ల శ్రీధర్‌కు ఆ కూల్ డ్రింక్ బాటిల్ తగలడంతో తీవ్ర గాయం అయ్యాయింది.. కంటి పై భాగంలో బాటిల్ బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమైంది. చికిత్స నిమిత్తం వెంటనే పిఠాపురం ప్రభుత్వ…
మాజీ ముఖ్యమంత్రి, త్వరలో మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో దోపిడీ, ఇసుక మాఫియ, దేవుని భూములు కబ్జా జరిగిందని ఆరోపించారు.
రాజంపేట ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అభ్యర్థి జయచంద్రా రెడ్డిని గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓటర్లను కోరారు. అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ..
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 2019 జూలై 29 న అసెంబ్లీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కు టీడీపీ మద్దతు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. టీడీపీ తరఫున పయ్యావుల కేశవులు అసెంబ్లీలో మాట్లాడి మద్దతు ఇచ్చారని తెలిపారు.
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన టీవీ ఛానెల్స్, సోషల్ మీడియాలో తన రెండో అల్లుడు, డాక్టర్ గౌతమ్ తన మీద చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ చేశాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సత్తెనపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు.