Chandrababu: నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్.. పవన్ పై చంద్రబాబు ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ గంజాయి కేంద్రంగా, డ్రగ్స్ క్యాపిటల్, దొంగ బియ్యం రవాణా కేంద్రంగా తయారు అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. “జగన్ బినామీ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పవన్ కి సవాలు చేస్తున్నాడు. ఆయన కాలు గోటికి కూడా నువ్వు సరిపోవు. ఖబడ్దార్ జాగ్రత్త. నిజ జీవితంలో నా మిత్రుడు పవన్ గబ్బర్ సింగ్. పొత్తులో మూడు పార్టీలు త్యాగం చేశాం. గతంలో టీడీపీ 31 అసెంబ్లీ సీట్లు, 8 సీట్లు పొత్తులో ఇవ్వలేదు. మీ కోసం పొత్తు పెట్టుకున్నాము. మాది ప్రజా మేనిపెస్టో.. జగన్ మేనిపెస్టో వెల వెల పోయింది. మోడీ గ్యారెంటీ కూడా అనుసంధానం చేసుకుని రాష్ట్రంలో పని చేస్తాం. మీరు వేసే ఓటు జగన్ గుండెల్లో దిగాలి. ఇది క్లాష్ వార్ కాదు క్యాష్ వార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్ అమలు లోకి తెచ్చేసాడు. మీ ఆస్తులకి జిరాక్స్ లు ఇస్తాడు. రికార్డ్ ఆన్ లైన్ లో పెట్టి పాస్ వర్డ్ వారి దగ్గర పెట్టుకోవడము ఏంటి? నీ భూమి నువ్వు అమ్మాలంటే వాడి పర్మిషన్ ఏంటి?”
READ MORE: RCB vs GT: బెంగళూరు భళా.. గుజరాత్ 147 ఆలౌట్!
Also Read
మన ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ పాస్ బుక్ లు చింపి మీ ఫోటోలు తో పాస్ బుక్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భూ హక్కు చట్టం పాస్ బుక్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ డాక్యుమెంట్స్ బహిరంగ సభలో చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెడతాను. ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్లు కాపాడే బాధ్యత నాది. ముస్లిం రిజర్వేషన్ కోసం గతంలో సుప్రీంకోర్టులో పోరాడం. మళ్ళీ పోరాడుతాం. కాపులు కి న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం. వచ్చే ఐదేళ్లు కాపులు సంక్షేమానికి పనిచేస్తాం. సీఎస్ కి తల తోక లేదు.. బుద్ధి జ్ఞానం లేదు. పింఛన్ దారులు చనిపోవడానికి కారణం ఎవరు? ఉద్యోగులు ఆలోచించి రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటు వేయండి.”
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు