మోసాలు చేసేందుకు దోచుకునేందుకు కూటమి సిద్ధంగా ఉందని.. వారి మాటలను నమ్మే మోసపోవద్దని రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గిరిజనులకు పిలుపునిచ్చారు. అల్లూరి జిల్లా అరకులోయలో వైసీపీ నిర్వహించిన రోడ్ షోకు ఆయన పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో ఉచిత వైద్యం, మందులు, మెరుగైన విద్య ఏర్పాటు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. గిరిజన ప్రాంతంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మెడికల్ క్లినిక్లను తమ ప్రభుత్వంలో ఏర్పాటు చేశామన్నారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో పాఠశాలలను ఆసుపత్రులను ఆధునికరించామని..అదేవిధంగా పాడేరులో 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నామన్నారు.
READ MORE: Rohith Vemula: రోహిత్ వేముల మృతి విచారణలో వైరుధ్యాలు, న్యాయం జరిగేలా చూస్తాం: కాంగ్రెస్..
పేదల భవిష్యత్తుకు అండగా ఉంటూ వారి జీవితాలలో వెలుగులు నింపేందుకు జగన్ అన్నివేళలా ఆలోచిస్తుంటారని.. అందుకోసం ఏమి చేయడానికైనా ముఖ్యమంత్రి జగన్ సిద్ధంగా ఉంటారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గిరిజన ప్రాంతంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. పింఛనుదారులు కొండల్లో ఉన్నా సరే ఒకటో తారీఖున వాలంటీర్ల ద్వారా పింఛను అందజేయడం జరిగిందన్నారు.కూటమి కుట్రలకు మోసపోకుండా.. అందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తిరిగి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని వైవి సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అరకు వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి గుమ్మ తనుజారాణి, ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ చైర్మన్ జల్లిపల్లి సుభద్ర పాల్గొన్నారు.